US 2024 ఎన్నికల్లో అమెరికన్ ప్రజలు డొనాల్డ్ ట్రంప్ వైపే మొగ్గుచూపారు. డొనాల్డ్ ట్రంప్ రెండో సారి అమెరికా అధ్యక్షుడు కావడం ఖాయమైంది. అమెరికా అధ్యక్ష ఎన్నికలో అత్యంత కీలకం అయిన స్వింగ్ స్టేట్లను కైవసం చేసుకున్న ట్రంప్.. రెండోసారి వైట్ హౌజ్ లో తిరిగి కాలుమోపనున్నారు. ట్రంప్ విజయం అనేక రికార్డులను బ్రేక్ చేస్తుంది.
గ్రోవర్ క్లీవ్ ల్యాండ్ తర్వాత 132 ఏళ్ల తర్వాత.. డొనాల్డ్ ఓ రికార్డును ఈ విజయంతో నెలకొల్పాడు. వరసగా పదవీ కాలంలో కొనసాగని రెండో అధ్యక్షుడిగా ట్రంప్ నిలిచాడు. గ్రోవర్ క్లీవ్ ల్యాండ్.. అమెరికాకు 22వ, 24 ప్రెసిడెంట్ గా 1885 నుంచి1889 వరకు, 1893 నుంచి 1897 వరకు పనిచేశారు. ట్రంప్ మొదటిసారి అధ్యక్షుడిగా 2016లో ఎన్నికయ్యారు. ఆ తర్వాత 2020లో బిడెన్ చేతిలో ఓడిపోయారు.
మరోవైపు 78ఏళ్ల వయస్సులో యూఎస్ చరిత్రలో అధ్యక్షుడిగా ఎన్నికైన రెండో వ్యక్తిగా ట్రంప్ చరిత్రలో నిలిచాడు. బిడెన్ అత్యంత వయోవృద్ధ అధ్యక్షుడిగా ఉన్నాడు.
ALSO READ : అమెరికా రాజకీయాల్లో కొత్త స్టార్ ఎలన్ మస్క్.. నా గెలుపులో అతడిదే కీ రోల్: ట్రంప్
20 ఏళ్లలో అత్యంత ప్రజాదరణ పొందిన ఓట్లను గెలుచుకున్న మొదటి రిపబ్లికన్ గా ట్రంప్ రికార్డు.
రెండుసార్లు అభిశంసనకు గురైన ఏకైక అధ్యక్షుడిగా ట్రంప్ చరిత్ర సృష్టించాడు. అయితే అన్ని కేసుల్లోనూ సెనేట్ అతన్ని నిర్ధోషిగా ప్రకటించింది.
చట్టపరమైన నేరారోపణలను ఎదుర్కొంటూ పదవిలో ఉన్న మొదటి యూఎస్ అధ్యక్షుడి కూడా ట్రంపే అవుతారు.