బ్రిటన్ సార్వత్రిక ఎన్నికల్లో శుక్రవారం(జూలై 5, 2024) లేబర్ పార్టీ నిర్ణయాత్మక విజయం సాధించింది. దశాబ్ద కాలంగా అపోజిషన్ లో ఉన్న లేబర్ పార్టీ.. బ్రిటన్ 2024 ఎన్నికల్లో అధికారాన్ని హస్తగతం చేసుకుంది. లేబర్ పార్టీ లీడర్ కెయిర్ స్టార్మర్ ప్రధానిగా ఎన్నికయ్యారు. బంకింగ్ హాం ప్యాలెస్ లో రాజు చార్లెస్ 3ని కలిశాక అధికారికంగా స్టార్మర్ ప్రధాని అయ్యారు. అయితే స్టార్మర్ బ్రిటన్ ప్రజలకు ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవడమే పెద్ద సవాల్ అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.
కైర్ స్టార్మర్..యూకే 2024 సార్వత్రిక ఎన్నికల్లో ఘన విజయం సాధించి బ్రిటన్ ప్రధానిగా చేపట్టబోతున్న లేబర్ పార్టీ అధినేత. దేశం మార్పుకోసం నిర్ణయాత్మక ఓటింగ్ చేయాలని నినాదంతో ఎన్నికల బరిలో నిలిచి గెలిచారు. దేశం ఫస్ట్.. తర్వాతే పార్టీ అన్న సెంటిమెంట్ కూడా బ్రిటన్ ప్రజల్లోకి తీసుకెళ్లడంతో సక్సెస్ అయ్యారు.ప్రస్తుత చిన్నాభిన్నంగా ఉన్న ఆర్థిక వ్యవస్థను దారిలో పెట్టడం, విద్యా, వైద్యం ప్రమాణాలతో అందించడం వంటి నిర్ధిష్ట ఎజెండాతో స్టార్మర్ బ్రిటన్ ప్రజలను ఆకట్టుకున్న స్టార్మర్..14ఏళ్ల పాటు ప్రతిపక్షంలో ఉన్న లేబర్ పార్టీ 2024 బ్రిటన్ సార్వత్రిక ఎన్నికల్లో అధికారంలోకి వచ్చేలా చేశారు.
14 సంవత్సరాల కన్జర్వేటివ్ పాలనకు ముగింపు పలికిన లేబర్ పార్టీ ఘన విజయం తర్వాత కైర్ స్టార్మర్ కొత్త ప్రధాన మంత్రిగా నియమితులయ్యారు. డౌనింగ్ స్ట్రీట్ వెలుపల తన మొదటి ప్రసంగంలో.. వెంటనే పని ప్రారంభించాలని అవసరం ఉందని కైర్ స్టార్మర్ అన్నారు. రాజకీయాలను ప్రజా సేవగా పేర్కొన్నారు. దేశానికి పెద్ద రీసెట్ అవసరమని..తమ పార్టీ బ్రిటన్ ను పునర్నిస్తుందని అన్నారు. ప్రజలు కోరుకున్నట్లు సందేహం లేకుండా పని వెంటనే ప్రారంభమవుతుందని చెప్పారు.
కొత్త ప్రధాని ముందున్న సవాళ్లు..
దేశ ఆర్థి వ్యవస్థను చక్కబెట్టడం, అందరికీ మెరుగైన విద్యా, వైద్యం అందించడం, బ్రిటన్ పన్ను విధానం, ఇమ్మిగ్రేషన్ అనుకూల విధానం, మిత్రదేశాలతో సత్సంబంధాలు కొనసాగించడం కొత్త ప్రధాని స్టార్మర్ ముందున్న సవాళ్లు. మొదటిది ద్రవ్య బాధ్యతపై దృష్టి సారించడం ద్వారా ద్రవ్యోల్బణం హెడ్‌విండ్‌లను అదుపు చేయడం, కొనసాగించడం చాలా ముఖ్యం.. స్టార్మర్ ఈ ముసుగులో ట్రేడ్ యూనియన్ ఒత్తిళ్లను అరికట్టాలి.రెండవది మౌలిక సదుపాయాలు , విద్య లక్ష్యంగా పెట్టుకున్న పెట్టుబడికి ప్రాధాన్యత ఇవ్వాలి. బ్రిటన్ దీర్ఘ కాల భవిష్యత్తు.. ఉత్పాదకతను పెంచడం, సంక్షేమ పథకాలపై ఆధారపడటాన్ని సులభతరం చేయడం, జనాభాను పెంచడంపై ఆధారపడి ఉంటుంది. ఈ క్రమంలో వృద్ధాప్య జనాభా ఎదుర్కొంటున్న ఆరోగ్య , సామాజిక సంరక్షణ సవాళ్లను కూడా ఎదుర్కొవాల్సి ఉంది.
ఎంట్రప్రెన్యూర్‌షిప్‌ను పెంచడానికి బ్రిటీష్ పన్ను విధానం, ఇమ్మిగ్రేషన్‌కు అనుకూలమైన విధానం కూడా స్టార్మర్ ముందున్న ప్రధానమైన సవాళ్లు. భారతదేశం వంటి భావసారూప్యత గల ప్రజాస్వామ్య దేశాలతో పొత్తులు కూడా సుస్థిరం చేయాల్సి ఉంటుంది. సునక్ తన భారత్ తో ఉన్న అనుబంధం స్పష్టంగా ఉంది. ఇప్పుడు సునక్ వారసుడిగా స్టార్మర్ ఈ అనుబంధాన్ని రెట్టింపు చేయాల్సి ఉంటుంది. యూరోపియన్ మిత్రదేశాలతో సంబంధాలను పునర్నిర్మించడం కూడా కారకం కావాలి.
స్టార్మర్ కు అధికారం అప్పజెప్పడం ద్వారా బ్రిటన్ ప్రజలు.. భవిష్యత్తు కోసం ఆశాజనకమైన దృక్పథం అవసరమని సంకేతాలు ఇచ్చారు. స్థిరత్వంపై దృష్టి , వృద్ధి కోసం కైర్ స్టార్మర్ తన గుడ్విల్ చెక్కుచెదరకుండా ముందుకు సాగాల్సి ఉంటుందంటున్నారు రాజకీయ విశ్లేషకులు