కొత్త పార్లమెంట్ లో రాజదండం సెంగోల్.. థ్రిల్లింగ్ హిస్టరీ

మన దేశ కొత్త పార్లమెంట్ భవనంలో లోక్ సభ స్పీకర్ సీటు దగ్గర  ‘సెంగోల్’ రాజదండం (Sengol History) ఏర్పాటు కాబోతోంది. మే 28న స్వయంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దాన్ని అక్కడ ప్రతిష్టించబోతున్నారు. ఈ తరుణంలో ‘సెంగోల్’ రాజదండం(Sengol History) ఎక్కడిది ? ఎవరిది ? ఎలా తయారు చేశారు ? ఎవరు తయారు చేశారు ? దాన్ని ఇప్పుడు పార్లమెంటులో పెట్టాల్సిన అవసరం ఏం వచ్చింది ? అనే దానిపై డిస్కషన్ నడుస్తోంది. మనం అందుకు సంబంధించిన కొన్ని ఆసక్తికర వివరాలను తెలుసుకుందాం.. 

భారత పార్లమెంట్ లో రాజదండం

భారత కొత్త పార్లమెంట్ లో మరో సరికొత్త ప్రత్యేకత ఉండబోతోంది.  కొత్త పార్లమెంట్ భవనం ఆదివారం (మే28)న ప్రారంభం కానుంది. ఈ పార్లమెంటు కొత్త భవనం మరో కొత్త ప్రత్యేకతను సంతరించుకోనుంది.సెంగోయ్ అయే రాజదండాన్ని  ప్రారంభోత్సవ వేడుకల్లో  ప్రధాని నరేంద్ర మోడీ స్పీకర్ కుర్చీ సమీపంలో ...  బంగారు రాజ దండాన్ని ఆవిష్కరించబోతున్నారు  ఇది పార్లమెంటు భవనంలో సెంగోల్ (రాజదండం) ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. .

సెంగోల్ చరిత్ర

సెంగోల్ అనే  రాజదండానికి చారిత్రక ప్రాధాన్యత ఉందని అమిత్ షా తెలిపారు. భారతీయులకు, బ్రిటిష్ వారికి మధ్య జరిగిన అధికార మార్పిడికి ఆ రాజదండమే నిదర్శనమని గుర్తు చేశారు. స్వతంత్ర భారత మొదటి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూకు బ్రిటిష్ ఇండియా చివరి వైస్రాయ్ లార్డ్ మౌంట్ బాటెన్ ఈ రాజదండం అందించారని అమిత్ షా తెలిపారు. ఈ రాజదండాన్ని సెంగోల్ అని పిలుస్తారని..  ఇది తమిళ పదం అయినా సెమ్మాయ్ (ధర్మం) నుంచి వచ్చిందని వెల్లడించారు. 

బ్యాక్ టు 1947..

‘సెంగోల్’ రాజదండం గురించి తెలుసుకోవాలంటే 1947 సంవత్సరంలో స్వాతంత్రం వచ్చిన రోజు చరిత్రను తెలుసుకోవాలి.  మన దేశానికి స్వాతంత్ర్యాన్ని ప్రకటించడానికి బ్రిటీష్ వాళ్ళు రెడీ అయ్యారు. ఈక్రమంలో ఇండియా తొలి ప్రధాన మంత్రిగా జవహర్ లాల్ నెహ్రూ అయ్యేందుకు రంగం సిద్ధమైంది. ఇటువంటి టైంలో బ్రిటీష్ ఇండియా  చివరి వైస్రాయ్ లార్డ్ మౌంట్ బాటన్ , జవహర్ లాల్ నెహ్రూ ఒక  టాపిక్ పై మాట్లాడుకున్నారు. ” మేం మీకు స్వాతంత్య్రం ఇస్తున్నాం కదా.. అధికారం మా  నుంచి మీకు బదిలీ అవుతోంది.. దీన్ని ప్రతిబించేలా ఏదైనా ప్రోగ్రాం చేస్తే బాగుంటుంది” అని నెహ్రూ తో  లార్డ్ మౌంట్ బాటన్  చెప్పారు

అధికార బదిలీకి రాజదండం

ఆ ప్రశ్న విన్న తర్వాత నెహ్రూ.. తనతో పాటు తన పక్కనే ఉన్న స్వతంత్ర భారతదేశపు మొదటి, చివరి భారతీయ గవర్నర్ జనరల్ రాజగోపాలాచారిని సలహా అడిగారట. దానికి రాజాజీ తమిళ సంప్రదాయంలో ఉన్న ఒక విధానాన్ని నెహ్రూకు వివరించారు.  ఏ దేశానికైనా కొత్త రాజుగా పదవీ బాధ్యతలు చేపట్టే సమయంలో ప్రధాన పూజారి ఓ రాజదండం ఆయనకు అందజేసే సంప్రదాయం ఉందని చెప్పుకొచ్చారు. చోళులు ఈ సంప్రదాయాన్ని అనుసరించారని తెలిపారట. దీంతో అలాంటి రాజదండం తయారు చేసే పనిని రాజాజీకి.. నెహ్రూ అప్పగించారట.

సెంగోల్ అంటే తమిళ పదం

ఆ వెంటనే  1947 జులైలో రాజగోపాలాచారి తమిళనాడులో ఉన్న 14వ శతాబ్దం నాటి మఠం “తిరువడుత్తురై ఆధీనం”కు వెళ్లి .. ఒక స్పెషల్ రాజదండం తయారు  చేయించమని కోరారు. అప్పట్లో మద్రాసులోని ఒక స్వర్ణకారునితో ఈ బంగారు రాజ దండాన్ని “తిరువడుత్తురై ఆధీనం” మఠం నిర్వాహకులు తయారు చేయించారు. రాజాజీ చెప్పినదంతా విన్న తర్వాత అక్కడి మఠాధిపతులు రాజదండం తయారీలో సహకరించేందుకు అంగీకరించారు. దానికి ‘సెంగోల్’ అని పేరు పెట్టారు. తమిళ పదం “సెమ్మై” నుంచి “సెంగోల్” అనే పదం వచ్చింది. దీని అర్థం “ధర్మం”.  ఈ రాజ దండం పై భాగంలో నంది ప్రతిమ ఉంటుంది.ఈ నంది గుర్తు న్యాయానికి ప్రతీకగా నిలుస్తుందని చెప్పారు.  ఈ రాజదండం పొడుగు 5 అడుగులు. పై భాగంలో నంది గుర్తును ఏర్పాటు చేశారు. 

ప్రభుత్వం తరఫున ప్రత్యేక విమానంలో రాజదండం..

దీని తయారీ పూర్తయిన తర్వాత రాజదండాన్ని ఢిల్లీకి తీసుకొని రావడానికి.. ప్రభుత్వం తరఫున ప్రత్యేక విమానాన్ని చెన్నైకి పంపారు. ఆ విమానంలో కూర్చొని “తిరువడుత్తురై ఆధీనం” మఠం నిర్వాహకులు రాజ దండాన్ని ఢిల్లీకి తీసుకెళ్లారు. ఆ మఠానికి చెందిన స్వామీజీ ఒకరు ఆ దండాన్ని మొదట లార్డ్ మౌంట్ బాటెన్ కు అందించారు. ఆ తర్వాత అతడి నుంచి దానిని వెనక్కి తిరిగి తీసుకుని.. గంగాజలంతో శుద్ధి చేశారు. ఆ తర్వాత ఆ రాజదండంను నెహ్రూ దగ్గరికి ఊరేగింపుగా తీసుకువెళ్లారు. భారతదేశానికి అర్ధరాత్రి స్వతంత్ర ప్రకటన చేయడానికి పావుగంట ముందు దానిని భారత నూతన ప్రధానికి అందజేశారు.  

ప్రస్తుతం అలహాబాద్ మ్యూజియంలో ... 

ఇక ఈ ప్రక్రియ జరుగుతున్నంత సేపు దీని కోసమే ప్రత్యేకంగా రూపొందించిన ఒక పాటను పాడారట. భారతదేశానికి స్వాతంత్రం వచ్చి ఇన్ని సంవత్సరాలు అవుతున్నా ఈ రాజదండంకు సంబంధించిన ప్రాధాన్యత కానీ.. చరిత్ర కానీ చాలామందికి తెలియదని అమిత్ షా అన్నారు. కొత్త పార్లమెంట్ లో  ప్రస్తుతం ఈ రాజదండం ఏర్పాటు వల్ల..  మన సంప్రదాయాలను ఆధునికతను సంధానించే ప్రయత్నం జరుగుతుందన్నారు.   ఇలా చేయాలనడం మోడీ దూరదృష్టికి నిదర్శనమని కొనియాడారు.  ఈ రాజ దండం ప్రస్తుతం అలహాబాద్ లోని మ్యూజియంలో ఉంది.  మే 28న పార్లమెంట్ భవన ప్రారంభోత్సవంలో  దీనిని పార్లమెంట్ భవనంలో అమర్చనున్నారు.

1947 ఆగష్టు 14న రాత్రి 11.45 గంటలకు..

1947 ఆగష్టు 14న భారతదేశానికి స్వాతంత్ర్యం రావడానికి కొన్ని నిమిషాల ముందు సుమారు 11.45 గంటలకు.. మఠం ప్రతినిధి బృందం నెహ్రూకు ‘సెంగోల్’ రాజదండం అందించింది. అనంతరం నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో లార్డ్ మౌంట్ బాటన్ ఆ రాజదండాన్ని “తిరువడుత్తురై ఆధీనం” మఠం ప్రతినిధి  కుమారస్వామి తంబిరాన్ కు ఇచ్చారు. అనంతరం  కుమారస్వామి తంబిరాన్ దానిపై పవిత్ర జలం చల్లి.. పండిట్ జవహర్‌లాల్ నెహ్రూకి అందజేశారు. ఈసందర్భంగా నెహ్రూకు పూలమాల వేసి నుదుటిపై బూడిద పోశారు. అందుకే ఇప్పుడు ‘సెంగోల్’ రాజదండాన్ని పార్లమెంట్ లో ప్రతిష్టించేందుకు కేంద్ర ప్రభుత్వం రెడీ అవుతోంది .