
రక్షా బంధన్ అంటే అక్కా, తమ్ముడు. అన్నా చెల్లెళ్ల మధ్య బంధానికి ప్రతీకగా చాలా మంది చెబుతుంటారు. ఈ రక్షాబంధన్ ను మన భారతదేశంలోనే ఎక్కువగా జరుపుకుంటారు. అయితే దీనినే రాఖీపౌర్ణమి అని లేదా జంధ్యాల పౌర్ణమి పేర్లతో పిలుస్తారు. ఈ రాఖీ పౌర్ణమి ఎప్పుడు ప్రారంభమైందో.. ఎలా వచ్చిందో తెలిపేందుకు స్పష్టమైన ఆధారాలు లేవు కాని ఈ రాఖీపౌర్ణమి గురించి పురాణాలలో కొన్ని కథలు పేర్కొనబడ్డాయని పండితులు చెబుతున్నారు. అవి బాగా ప్రాచుర్యం బాగా పొందాయి. వాటిలో ముఖ్యమైన వాటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
వృత్తాసురుడితో యుద్ధం చేస్తున్నప్పుడు స్వర్గానికి అధిపతి అయిన ఇంద్రుడు ఓటమి అంచులకు చేరతాడట. అప్పుడు తన పతికి పరాజయం కలగకూడదని కోరుతూ, ఇంద్రుని భార్య అయిన శచీదేవి ఓ పవిత్రమైన దారాన్ని మంత్రించి అతడి కుడిచేతి మణికట్టుకు కట్టింది. దీంతో ఆయన రాక్షసులను ఓడించి, విజయం సాధించారని, అలా రాఖీ పుట్టిందని పండితులు చెబుతారు.
వామనుడి రూపంలో.. రాక్షసుల రాజు అయిన బలి చక్రవర్తి భూమండలాన్ని ఆక్రమించినప్పుడు దానవుల నుంచి మానవులను రక్షించడానికి శ్రీ మహావిష్ణువు వైకుంఠాన్ని వదిలి వామనుడి రూపంలో భూమి మీదకు వస్తాడు. అప్పుడు లక్ష్మీదేవి ఒక బ్రాహ్మణ యువతి రూపంలో రాక్షస రాజైన బలి చక్రవర్తి దగ్గరికి వెళ్తుంది. శ్రావణ పౌర్ణమి రోజు బలి చక్రవర్తికి పవిత్రమైన దారాన్ని చేతికి కట్టి, తానెవరో చెబుతుంది.
మానవులకు విముక్తి.. తన ప్రత్యక్ష దైవమైన భర్తను తిరిగి వైకుంఠానికి పంపించాలని కోరుతుంది. అప్పుడు బలి చక్రవర్తి ఆమె కోసం తన రాజ్యాన్ని వదిలి, మానవులకు విముక్తి కలిగిస్తాడు. అలా విష్ణుమూర్తిని వైకుంఠానికి వెళ్లమని కోరతాడు.
ఇక క్రీస్తుపూర్వం 326 లో అలెగ్జాండర్ భారతదేశంపై దాడి చేసినప్పుడు, అతని భార్య రోక్సానా.. పౌరస్ రాజు అయిన పోరస్ ( పురుషోత్తముడు)కు పవిత్రమైన దారం పంపి, యుద్ధభూమిలో తన భర్తకు హాని చేయవద్దని కోరింది. యుద్ధంలో, పోరస్ తన మణికట్టు మీద ఉన్న రాఖీని చూసి అలెగ్జాండర్‌పై దాడి చేయకుండా తనను తాను నిగ్రహించుకున్నాడు.
అలెగ్జాండర్ భార్య రోక్సానా తక్షశిల రాజు పురుషోత్తముడిని తన సోదరుడిగా భావించి రాఖీ కడుతుంది. విశ్వవిజేతగా నిలవాలనే తపనతో గ్రీకు యువరాజు అలెగ్జాండర్ భారత దేశంపై దండెత్తివచ్చాడు. అప్పుడు బాక్ట్రియన్ యువరాణి రోక్సానాను వివాహం చేసుకుంటాడు. ఆ వివాహబంధం ద్వారా మధ్య ఆసియా ముఖ్యంగా జీలం, చినాబ్ నదుల మధ్య ఉన్న రాజ్యాలను జయించాలని భావించిన అలెగ్జాండర్ ఆ రాజులపై యుద్ధం ప్రకటిస్తాడు. పురుషోత్తముడిపై దండెత్తిరావాలని అలెగ్జాండర్‌ను అంబి ఆహ్వానించాడు. దీంతో జీలం నది వడ్డున పురుషోత్తముడు అలెగ్జాండర్ సేనలతో యుద్ధానికి సిద్ధమవుతాడు. పురుషోత్తముడి పరాక్రమాల గురించి తెలుసుకున్న అలెగ్జాండర్ భార్య రోక్సానా ఆయనను తన అన్నలా భావించి రాఖీ కడుతుంది. యుద్ధంలో తన భర్త అలెగ్జాండర్ ఓడిపోతే చంపవద్దని కోరుతుంది. దీంతో అలెగ్జాండర్‌ను చంపే అవకాశం దక్కినా తన చేతికున్న రాఖీచూసి పురుషోత్తముడు విరమించుకున్నాడు.
రవీంద్రనాథ్ ఠాగూర్ vs బెంగాల్ విభజన 1905 లో, బెంగాల్ విభజన జరిగినప్పుడు, నోబెల్ గ్రహీత రవీంద్రనాథ్ ఠాగూర్ రాఖీ మహోత్సవాలను ప్రారంభించారు. బెంగాల్‌లోని హిందువులు, ముస్లింల మధ్య ప్రేమ, ఐక్యతను బలోపేతం చేశారు. బ్రిటిషర్లకు వ్యతిరేకంగా నిరసన తెలపాలని ఆయన వారిని కోరారు. ఆయన చెప్పినట్లుగా నడుచుకున్నారు బెంగాలీయులు. పశ్చిమ బెంగాల్‌లో రాఖీ కట్టడం అనే సంప్రదాయం ఇప్పటికీ కొనసాగుతోంది.
విజయం కోసం భార్యలు భర్తలకు కట్టే రక్షా బంధన్..
అంటే రక్షా బంధన్ అనేది కేవలం సోదర సోదరీ మణులకే కాదు భార్యా భర్తల మద్య కూడా ఉందని తెలుస్తోంది. యుద్ధానికి వెళ్లే భర్తలకు, భార్యలు వీరతిలకాన్ని అద్ది, రక్షను కట్టి పంపించడం ఆనవాయితీగా వచ్చింది. ఇదే క్రమంగా రక్షాబంధనంగా మారిందని అంటారు. కానీ రక్షా బంధన్ అనేది బంధాలకే కాదు రక్షఖు గుర్తు అని చెప్పకనే చెబుతోంది. అది భర్తకు భార్య కట్టిన సోదరులకు సోదరీమణులు కట్టినా రక్షా బంధన్ అనేది రక్షకు గుర్తు అని మాత్రం నిదర్శనంగా కనిపిస్తోంది.
భర్త దేవేంద్రడుకి రక్ష బంధన్ కట్టిన భార్య శచీదేవి..
స్వర్గలోకాధి పతి దేవేంద్రడు రాజ్యమైన అమరావతిని, బలిచక్రవర్తి సొంతం చేసుకున్నాడు. ఆ బలిచక్రవర్తిని ఓడించి, తన రాజ్యాన్ని తిరిగి సాధించేందుకు ఇంద్రుడు, బలి మీదకు యుద్ధానికి బయల్దేరాడు. ఆ సమయంలో తన భర్తకు విజయం కలగాలని కోరుకుంటూ… ఇంద్రుని భార్య శచీదేవి, విష్ణుమూర్తిని వేడుకొంది. అంతట విష్ణుమూర్తి ఆమెకు ఒక రక్షను ఆమెకు అందించాడు. శచీదేవి ఆ రక్షను తన భర్తకు కట్టి యుద్ధానికి సాగనంపింది. ఆ యుద్ధంలో ఇంద్రుడు విజయం సాధించాడు.
రక్షా బంధన్ వేడుకలు వేద యుగంలో ప్రారంభమైనా కానీ ఈ సంప్రదాయాన్ని దేశంలో సోదర సోదరీమణులు ఇప్పటికీ అనుసరిస్తున్నారు. సాధారణ రాఖీల నుండి విదేశాలలో ఉన్న సోదరులకు పంపించే ఆధునిక ఇ-రాఖీల వరకు రక్షా బంధన్ బాగా అభివృద్ధి చెందింది. బంధాలను బలోపేతం చేస్తూనే ఉంది. కాలం మారుతున్న కొద్దీ, సోదరీమణులు తమ తోబుట్టువులకు రాఖీలు కట్టడం మాత్రమే కాదు, కొంతమంది తమకు తాము ధరించడం కూడా కనిపిస్తుంది. పురుషుడు లేదా స్త్రీ, పట్టింపు లేదు.. ప్రతి రక్షకుడు రాఖీకి అర్హుడు.. మొదటి రాఖీని ఎవరు కట్టారు అనేది ఎవరికి తెలియని రహస్యం కావచ్చు. కానీ రక్షాబంధన్ ఓ సంతోష సంబరం. పండుగ ఏదైతేనేమి పదిమంది కుటుంబ సభ్యులు కలిస్తే ఆ ఇల్లు ఆనందాల హరివిల్లవుతుంది. అందరికీ రక్షా బంధన్ శుభాకాంక్షలు!