బిట్​ బ్యాంక్​: కర్ణాటిక్​ యుద్ధాలు

బిట్​ బ్యాంక్​: కర్ణాటిక్​ యుద్ధాలు
  •     మధ్యయుగాలు, ఆధునిక భారతదేశ చరిత్రలో భారతదేశంలో అత్యంత శక్తిమంతమైన విశాలమైన రాజ్యం హైదరాబాద్​. 
  •     నిజాం ఉల్​ ముల్క్​ కాలంలో కర్ణాటక ప్రాంత రాజధాని ఆర్కాట్​. 
  •     1742లో నిజాం ఉల్​ ముల్క్​ ఆర్కాట్​ నవాబుగా సయీద్​ మహమ్మద్​ ఖాన్​ను నియమించారు. 
  •     1747లో ఆర్కాట్​తోపాటు కొండనూరు, కడప నవాబుగా నిజాం ఉల్​ ముల్క్​ తన కుమారుడు నాసర్​ జంగ్​ను నియమించాడు. 
  •     ఆధునిక భారతదేశ చరిత్రలో దక్షిణ భారతదేశ చరిత్రను కర్ణాటక యుద్ధాలు సమూలంగా మార్చాయి. 
  •     కర్ణాటక యుద్ధాలకు ప్రధాన కారణం ఫ్రెంచ్​, ఇంగ్లాండ్​ కంపెనీల మధ్య వ్యాపార పోటీ.
  •     మొదటి కర్ణాటక యుద్ధానికి ప్రధాన కారణం ఆస్ట్రియా వారసత్వ యుద్ధం. 
  •     మొదటి కర్ణాటక యుద్ధ కాలంలో ఆర్కాట్​ నవాబు అన్వరుద్ధీన్​. 
  •     ఫ్రెంచ్​ వారికి, కర్ణాటక నవాబు సైన్యానికి మధ్య 1746లో శాంథోమ్​ వద్ద జరిగిన యుద్ధాన్ని అడయార్​ యుద్ధం అని పిలుస్తారు. ఈ యుద్ధంలో కర్ణాటక నవాబు సైన్యం ఓటమిపాలైంది. 
  •     అడయార్​ యుద్ధంలో కర్ణాటక నవాబు ఓటమితో మద్రాసు ఫ్రెంచ్​ వారి వశమైంది. 
  •     ఐరోపాలో ఆస్ట్రియా వారసత్వ యుద్ధం 1748లో అక్సిల్లా చాపెల్లా సంధితో ముగిసింది. ఈ సంధి ప్రకారం మద్రాసు స్థావరాన్ని ఫ్రెంచ్​ వారు ఆంగ్లేయులకు అప్పగించారు. 
  •     1748వ సంవత్సరంలో నిజాం ఉల్​ ముల్క్​ మరణానంతరం దక్కన్​కు పాలకునిగా నిజాం ఉల్​ ముల్క్​ కుమార్తె కుమారుడు ముజఫర్​ జంగ్​ ప్రకటించుకున్నాడు. 
  •     రెండో కర్ణాటక యుద్ధం క్రీ.శ.1749లో మొదలైంది. 
  •     రెండో కర్ణాటక యుద్ధంలో ఆర్కాట్​ నవాబు అన్వరుద్దీన్​ను ఓడించడానికి చందాసాహెబ్, ముజఫర్​ జంగ్​, ఫ్రెంచ్​ గవర్నర్​ డూప్లెక్స్​ కూటమి కట్టారు. 
  •     1749 ఆగస్టులో మొదలైన రెండో కర్ణాటక యుద్ధానికి గల మరో పేరు అంబూర్​ యుద్ధం. 
  •     అంబూర్​ యుద్ధంలో ఫ్రెంచ్​ వారి సహకారంతో కర్ణాటక నవాబుగా చందాసాహెబ్​ పట్టాభిషిక్తుడయ్యాడు. 
  •     చందాసాహెబ్ ఫ్రెంచ్​ వారికి ఇచ్చిన ప్రాంతాలు కోరమాండల్​, పాండిచ్చేరికి మధ్య ఉన్న ప్రాంతాలు. 
  •     మొఘల్​ సేనలు 1750లో ముజఫర్​ జంగ్​ను కఠినంగా శిక్షించకుండా నిజాం పెష్కార్​ రాందాసు పండిట్​ కాపాడాడు. 
  •     1750లో జరిగిన యుద్ధంలో నాసిర్​ జంగ్​ను కర్నూలు నవాబు హిమ్మత్​ ఖాన్​ తుపాకీతో కాల్చి చంపాడు. 
  •     మృతిచెందిన నాసిర్​జంగ్​ తలను తీసుకొని ముజఫర్​ జంగ్​ వద్ద కడప నవాబు అబ్దుల్​ నబీఖాన్​ వెళ్లాడు. 
  •     గొప్ప ప్రజా దర్బార్​ ఏర్పాటు చేసుకుని ముజఫర్​ జంగ్​ 1750 డిసెంబర్​ 31న రాజుగా ప్రకటించుకున్నాడు. 
  •     ఫ్రెంచ్​ వారిపై కృతజ్ఞతతో డూప్లెక్స్​కు ముజఫర్​ జంగ్​ ఇచ్చిన బిరుదు జఫర్​జంగ్​. 
  •     డూప్లెక్స్​ను ముజఫర్​జంగ్​ కృష్ణా నదికి దక్షిణంగా ఉన్న రాజ్య ప్రాంతాలకు నాయబ్​గా నియమించాడు. అంతేకాకుండా కర్ణాటక, మైసూరు ప్రాంతాలకు నవాబుగా చేశాడు. 
  •     ముజఫర్​జంగ్​ ఫ్రెంచ్​ వారికి ఇచ్చిన ప్రాంతాలు మచిలీపట్నం, యానాం, కరైకల్​. 
  •     1751 జనవరిలో ముజఫర్​ జంగ్​కు వ్యతిరేకంగా పఠాన్​ నవాబులు తిరుగుబాటు చేశారు.
  •     పఠాన్​ నవాబులపై ముజఫర్​ జంగ్​ యుద్ధం చేసిన ప్రాంతం లక్కిరెడ్డి పల్లి కనుమ దగ్గర రాయచోటి అనే ప్రాంతం. 
  •     ముజఫర్​జంగ్​ తరఫున యుద్ధం చేసిన ఫ్రెంచి సైన్యాలకు నాయకత్వం వహించింది బుస్సీ.
  •     1751 జనవరి యుద్ధంలో ముజఫర్​జంగ్​ను కర్నూల్​ నవాబు హిమ్మత్​ఖాన్​ చంపాడు. అనంతరం 1751లో హైదరాబాద్​ నవాబుగా నిజాం ఉల్​ ముల్క్​ కుమారుడు సలాబత్​జంగ్​ను బుస్సీ నియమించాడు. 
  •     సలాబత్​ జంగ్​ ఫ్రెంచ్​ వారికిచ్చిన ప్రాంతాలు కొండపల్లి, గుంటూరు, ఏలూరు, రాజమండ్రి, చికాకోల్​ ప్రాంతాలు.
  •     సలాబత్​జంగ్​ దక్షిణ కృష్ణ ప్రాంతానికి డూప్లెక్స్​ను గవర్నర్​గా నియమించాడు. కర్ణాటక ప్రాంతంలో ఫ్రెంచ్​ వారి ఓటమి తర్వాత సలాబత్​జంగ్​కు ఆంగ్లేయులు మద్దతు ప్రకటించారు.
  •     రెండో కర్ణాటక యుద్ధం పాండిచ్చేరి సంధితో ముగిసింది. ఇంగ్లీషు వారితో పాండిచ్చేరి సంధి చేసుకున్న ఫ్రెంచ్​ అధికారి గడేహ్యూ.
  •     1756, మే 17న ఆస్ట్రియా, ప్రష్యాల మధ్య సప్తవర్ష సంగ్రామం మొదలైంది. 
  •     1758లో కర్ణాటక ప్రాంతంలో ఫ్రెంచి, ఆంగ్లేయులకు మధ్య యుద్ధం ప్రారంభమైంది. 
  •     మూడో కర్ణాటక యుద్ధంలో ఫ్రెంచి వారికి కౌంట్​ డి లాలీ నాయకత్వం వహించాడు. 1759 మే 14న హైదరాబాద్​ నిజాం సలాబత్​జంగ్​తో ఆంగ్లేయులు సంధి చేసుకున్నారు.