చోళులు స్థానిక స్వయం పాలనా విధానం అనుసరించారు. ఇది ఆధునిక స్థానిక పరిపాలన కంటే కూడా మెరుగైంది. చోళులు రాజ్యాన్ని మండలాలు, మండలాలను వలనాడులుగా, వలనాడులను నాడులుగా, నాడులను గ్రామాలుగా విభజించారు. మండలాలు ప్రస్తుత రాష్ట్రంతో సమానం. దీనికి అధిపతి యువరాజు. వలనాడు ప్రస్తు జిల్లాతో సమానం. దీనిని నట్టార్ అనే సభ పాలించేది.
ఈ సహలో ఉదయం, నాడుకెలవన్, నలవన్ అనే అధికారులు ఉండేవారు. నాడును నగరత్తల్ అనే సభ పాలించేది. గ్రామాలను కుర్రం లేదా కొట్టం అని పిలిచేవారు. చోళుల గ్రామపాలన గురించి మొదటి పరాంతకుని ఉత్తర మెరూర్ శాసనం వివరిస్తుంది. గ్రామాల్లో స్వయం పరిపాలనా విధానం అమలులో ఉండేది. గ్రామాల్లోని ప్రజలందరు గ్రామసభగా ఉండేవారు. దీనిని పెరుంగూర్ అని, అందులోని సభ్యులను పెరుమక్కల్ అని వ్యవహరించేవారు.
రాజు సర్వాధికారి. రాజు దేవరాజు అనే పాత్రను స్వీకరించాడు. వీరి బిరుదుల్లో చక్రవర్తిగళ్ అనే బిరుదు కనిపిస్తుంది. చాళుక్యుల మొదటి రాజధాని తంజావూర్. రెండో రాజధాని రాజేంద్రచోళుని కాలంలో గంగైకొండచొళపురానికి మార్చారు. ముదిగొండ, కంచి కూడా వీరి రాజధానులుగా ఉన్నాయి. రాజుకు పెరుందం(రాజ్యంలో ఉన్నత ఉద్యోగుల హోదా), సిరున్ తరమ్ (రాజ్యంలో చిన్న ఉద్యోగుల హోదా) అనే ఉద్యోగ వర్గాలు సహాయంగా ఉండేవి. రాజుకు సహాయపడటానికి మంత్రి పరిషత్ ఉండేది. ఉద్యోగుల సభను అధిగరైగళ అనేవారు. ఇందులో బళైన యుగం (కార్యదర్శి), ఆదివాసన్, ఓళయనాయకన్ అనే వారు ముఖ్యులు. వీరి పాలనలో వివిధ తరగతుల ఉద్యోగులను కొరుమిగల్ పనితుక్కల్ అని వ్యవహరించినట్లు తిరుముక్కడల్లోని వీర రాజేంద్ర శాసనం ద్వారా తెలుస్తుంది.
సాంఘిక పరిస్థితులు
చోళుల కాలంలో వలంగై, ఇందలగై అనే వర్ణాలు ఉండేవి. బ్రహ్మణులకు, వర్తకులకు విశేష గౌరవం ఉంది. అగ్రహారాలను బ్రహ్మధేయ ఇనాములనేవారు. వర్తకులందరూ సంఘంగా ఏర్పడి సామూహిక వ్యాపారం చేసేవారు. ఈ సంఘాన్ని మణిగ్రామం అనేవారు. వర్తకంలో మణిగ్రామ్ అయినూర్ వార్ అనేవి ముఖ్యమైనవి. వీరు 1015, 1033, 1037 కాలంలో చైనా చక్రవర్తి కొలువుకు రాయబారులను పంపారు. చోళుల అధికార మతం శైవం. వీరు హిందూ మత అభిమానులు. పాలకుల్లో అధికులు శైవులే. కొదంబులూరు శాసనం వీరి మతం గురించి తెలుపుతుంది. ఈ కాలంలో శంకరాచార్యులు అద్వైతాన్ని బోధించారు. జ్ఞాన మార్గం ద్వారా భగవంతున్ని చేరవచ్చని అద్వైతం చెబుతుంది.
రామానుజాచార్యులు విశిష్ట అద్వైతాన్ని బోధించారు. ప్రేమతో భగవంతున్ని చేరవచ్చని విశిష్ట అద్వైతం చెబుతుంది. శూద్రులకు దేవాలయ ప్రవేశం కల్పించారుఎ. మద్వాచార్యుడు ద్వైతాన్ని బోధించారు. ఈ కాలంలో స్త్రీ స్థాయి హీనంగా ఉంది. సతీసహగమనం ఆచారం అమలులో ఉంది. రెండో పరాంతకుని భార్య వాసరన మహారాణి సతీసహగమనం చేసింది. దేవదాసీ వ్యవస్థ అమలులో ఉంది. దేవదాసి అంటే దేవునికి అంకితమైన వారని అర్థం. చోళుల కాలంలో శైవ, వైష్ణవ మతాల మధ్య తీవ్ర స్థాయిలో భేదాలు ఉన్నాయి. కులోత్తుంగ చోళుని హింస భరించలేకపోయిన రామానుజాచార్యుడు హోయసాల రాజ్యానికి పారిపోయాడు. ఇందుకుగాను కులోత్తుంగున్ని వైష్ణవులు క్రిమికంఠచోళుడు అని అన్నారు.
సాహిత్యం
తమిళ సాహిత్య చరిత్రలో చోళుయుగం స్వర్ణయుగం. తిరుత్తక దేవర అనే జైన భిక్షువు జీవక చింతామణి అనే జైన గ్రంథాన్ని రచించాడు. దీని ఆధారంగానే కంబన్ తమిళ రామాయణాన్ని రచించాడు. శక్కిలార్ పెరియ పురాణమ్ను రచించాడు. ఇది శైవ భక్తుల గురించి తెలియజేస్తుంది. జయగొండార్ కళింగట్టు పరణి అనే గ్రంథాన్ని రచించాడు. ఇందులో కులోత్తుంగుని విజయాలను వర్ణించాడు. మొదటి పరాంతుకుని కాలంలో వెంకట మాధవుడు అనే కవి రుగ్వేదానికి సంస్కృతంలో భాష్యాన్ని రచించాడు. రెండో రాజరాజు కాలంలో కేశవస్వామి నాసార్ణవ సంక్షేమం అనే సంస్కృత నిఘంటువు రచించాడు. అమిత సాగరుడు అనే కవి చంధోగ్రంథం అనే జైన గ్రంథాన్ని రచించాడు. నంబి ఆడార్ అనే కవి నంబిగేయాలు అనే గ్రంథాన్ని రచించాడు. ఇతనిని తమిళ వ్యాసుడిగా పేర్కొంటారు.
ఇతర పన్నులు
- తరైయిరై (మగ్గంపై పన్ను)
- శిక్కరై (తేలిక వారిపై పన్ను)
- తట్టార్ పొట్టం (స్వర్ణకారులపై పన్ను)
- వలక్కునీర్ పట్టం (నీటి వనరులపై పన్ను)
- అంగాడిపట్టం (సంతలపై పన్ను)
- శెట్టిరాయ్ (వర్తక సుంకాలపై పన్ను)
- ఉప్పాయి (ఉప్పుపై పన్ను)
- పొడి కావాలి కుల (రక్షకభట పన్ను)
వాస్తు శైలి
ద్రావిడ శైలికి పరాకాష్టగా చోళ యుగాన్నిపేర్కొంటారు. చోళుల తొలి దేవాలయాల మీద నాగరశైలి ప్రభావం కనిపిస్తుంది. కాలియపట్టు, తిరుప్పూరు, విషమలూరు, పనంగుడి, తిరుక్కట్టలై అనే ప్రదేశాల్లో చోళుల తొలి దేవాలయాలు ఉన్నాయి. తిరుక్కట్టలైలోని సుందరేశ్వరాలయం వీరి తొలి దేవాలయ లక్షణాలను కలిగి ఉంది. చోళుల ఆలయ నిర్మాణానికి చెందిన ముఖ్య లక్షణం విమాన నిర్మాణాలు. తర్వాతి కాలంలో వచ్చిన గోపురం లేదా ముఖద్వారాలు విమాన నిర్మాణాన్ని మరుగున పడేశాయి.
బృహదీశ్వరాలయం
క్రీ.శ.1009లో మొదటి రాజరాజు తంజావూర్లో బృహదీశ్వరాల యం(శివాలయం) నిర్మించాడు. ఈ ఆలయాన్ని భారతీయ శిల్పకళ కు గీటురాయిగా ఫెర్సి బ్రౌన్ వర్ణించాడు. దేశంలోనే ఎత్తయిన దేవాలయం బృహదీశ్వరాలయం. ఈ ఆలయ నిర్మాణంలో రాజరాజచోళునికి కరువూర్దేవర్ అనే సిద్ధుడు సహకరించాడు.
ప్రతి గ్రామాన్ని మూడు సభలు పాలించేవి. అవి.. ఉర్, సభ, నగరమ్
ఉర్: ఇందులో బ్రాహ్మణేతరులైన రైతు ప్రతినిధులు సభ్యులు.
సభ: బ్రాహ్మణులు నివసించే అగ్రహారం. దీనిని పురుంగిరి అని వ్యవహరించేవారు.
నగరమ్: వర్తక సంఘాల ప్రతినిధులు సభ్యులు.
ప్రతి గ్రామాన్ని పరిపాలనా సౌలభ్యం కోసం 30 వార్డులుగా విభజించారు. వీటిని కుడుంబులు అనేవారు. ప్రతి వార్డు నుంచి ఒక సభ్యుడినిగ్రామ సభకు ఎన్నుకునేవారు.
ఎన్నికకు అర్హతలు
35 నుంచి 70 సంవత్సరాల మధ్య వయస్సు ఉండాలి.
ఎకరంన్నర భూమి ఉండాలి(1/4 వెలి విలువ ఎకరంన్నర), సొంత ఇల్లు ఉండాలి.
ఎన్నికల లాటరీ పద్ధతిలో జరిగేది. దీనిని కూడవొలై అనేవారు.
గ్రామసభలోని ఉప సంఘాలను వారియమ్ అనేవారు. ఇందులో వేర్వేరు ఉపసంఘాలు ఉండేవి.
సంవత్సర వారియం (వార్షిక కమిటీ) 12 మంది సభ్యులు. ఇది జ్ఙాన వృద్ధుల కమిటీ
- ఎరివారియం – తటాకాలు
- తోటవారియం – తోటలు
- పొన్వారియం – పన్నులు
- ధర్మ వారియం – మతం, వైద్యం
- పంచవార వారియం – మిగిలిన కమిటీలు
- న్యాయత్తార్ వారియం – న్యాయం