మంచి పాలనతో ప్రజల హృదయాల్లో సుస్థిర స్థానాన్ని ఏర్పరుచుకున్న రాజులు చరిత్రలో కొందరే ఉన్నారు. అయితే చాలా మంది మాత్రం మూర్ఖపు నిర్ణయాలతో ప్రజల్ని ఆగం పట్టించారు. అలాంటి వాళ్లలో మైడస్ చక్రవర్తి ఒకడు. గ్రీకు పురాణాల్లో మైడస్ పాలనకి ఒక ప్రత్యేక స్థానం ఉంది. అందుకే అతని జీవితం ఈ జనరేషన్ పిల్లలకు ఒక నీతి కథగా మారింది.
ప్రాచీన గ్రీకు దేశం పిజ్రియాలోని పెన్సినస్ నగరానికి రాజు గోర్డియస్. ఆయన భార్య సైబెలె... వీళ్లిద్దరి దత్తపుత్రుడు మైడస్. తండ్రి మరణం తర్వాత అతను సింహాసనాన్ని అధిష్టించాడు. అయితే తన తల్లి ఒక దేవతని అందుకే తనని కూడా దేవుడిగా భావించాలని... ప్రజలకు ఆజ్ఞ జారీ చేశాడు. మైడస్ ఏనాడూ ప్రజల బాగోగులు పట్టించుకునేవాడు కాదు. 'రోగ్ రూలర్'గా, మూర్ఖపు నిర్ణయాలతో ప్రజల్ని దిక్కుతోచని వాళ్లను చేశాడు. మరోవైపు గ్రీకు పురాణ దేవతల్ని నిర్లక్ష్యం చేసేవాడు. అయితే తన జీవితంలో మైడస్ పూజించిన ఏకైక దేవుడు డియోనైసిస్.
గోల్డెన్ టచ్
డియోనైసిస్ టైంలో విలాస దేవుడిగా (వైన్ గాడ్) పూజలు అందుకునేవాడు. అందుకు తగ్గట్లే రోజూ మందు, విందు పార్టీలతో విలాసవంతంగా గడిపేవాడు మైడస్. దానికోసం విచ్చలవిడిగా ప్రజాధనాన్ని వృథా చేశాడు. ఒకరోజు మంత్రశక్తులు ఉన్న ఒక వ్యక్తి ప్యాలెస్ ను అనుకుని ఉన్న గార్డెన్లో విశ్రాంతి తీసుకుంటూ మైడస్ కి కనిపిస్తాడు. అతను డియోనైనిస్ అనుచరుడు "సటైర్'గా గుర్తించి ప్యాలెస్ లోకి తీసుకెళ్లి రాచమర్యాదలు చేశాడు. ఆ మర్యాదలు నచ్చి మైడస్ కి ఒక వరం ఇస్తానంటాడు సటైర్. దురాశతో "తాను ముట్టుకున్నదల్లా బంగారం కావాలి" అని కోరుకుంటాడు మైడస్, ప్యాలెస్, తినే తిండి, ఆఖరికి ప్రేమగా చూసుకునే కూతురు కూడా బంగారు బొమ్మగా మారిపోతుంది. తన తప్పును గుర్తించిన మైడస్ సటైరి వర్గాన్ని వెనక్కి తీసుకోమని కోరతాడు. పరిహారంగా ప్యాక్డోలస్ నదిలో చేతులు కడగమని చెప్తాడు సటైర్. చెప్పినట్లు చేస్తాడు మైడస్ ప్యాలెస్ తో పాటు కూతురు కూడా మామూలు స్థితికి వస్తుంది.
మూడు థియరీలు
మైడస్ గురించి చరిత్రలో మూడు కథలు ఉన్నాయి. పైన చెప్పుకున్నది ఒక కథ. మిగతా రెండు కథలు మాత్రం మైడస్ ను గొప్ప వీరుడిగా చూపిస్తాయి. సిమేరియన్ల దాడులతో గోర్డియమ్ రాజ్యం అంతం అయ్యాక చివరి రాజు మైడస్' సూసైడ్ చేసుకున్నాడనే కథ ప్రచారంలో ఉంది. పరాక్రముడిగా పేరొందిన మైడస్.. శత్రువులతో యుద్ధంలో పోరాడుతూ వీరమరణం పొందాడన్నది మరోకథ.
ALSO READ | ఆధ్యాత్మికం: మౌనం ఎన్ని రకాలు.. ధ్యానం వల్ల కలిగే లాభాలు ఇవే..
మైడస్ కూతురి పేరు 'జోయె అసలు కూతురే లేదని కొడుకు 'అంచరన్' మాత్రమే ఉన్నాడని మరికొందరు చరిత్రకారులు వాదిస్తుంటారు. మైనస్ లైఫ్ మీద వందల సంఖ్యలో పెయింటింగ్లు అయితే 'పెన్సినన్ మైడస్ ' ని గీశారు ఆర్టిస్టులు.. గౌరవించేవాళ్లు కాదనే ఆధారాలు కొన్ని తవ్వకాల్లో బయటపడ్డాయి. రాజులు అతని విగ్రహాలు మైడస్ తర్వాతి ఏర్పాటు చేస్తే... జనాలు మాత్రం అతన్ని అవమానించేలా ఆ విగ్రహాలకు మార్పులు చేశారు. బహుశా అతని మీద ఉన్న ద్వేషం వాళ్లతో ఆ పని చేయించి ఉంటుందని పరిశోధకులు భావిస్తున్నారు.
మైడస్ జ్ఞాపకాలని!
గ్రీస్ దేశానికి ఉత్తరాన ఉన్న వర్గినా టౌన్లో 1957లో యూనివర్సిటీ ఆఫ్ పెన్సిల్వేనియా పరిశోధకుడు రోడ్నె యంగ్ తన టీమ్ తో కలిసి తవ్వకాలు చేపట్టాడు. ఆ ప్రాంతంలో చక్రవర్తుల సమాధుల్ని గుర్తించి 'గ్రేట్ టుములస్'గా పేరు పెట్టాడు. 1977లో ఆంధ్రోనికోస్ అనే రీసెర్చర్ ప్రాంతంలో మరో నాలుగు సమాధుల్ని గుర్తించాడు. వాటిల్లో నాలుగు శవపేటికలు ఎలాంటి డ్యామేజ్ లేకుండా ఉన్నాయి. వాటిలో ఒక సమాధిలో వైన్, విలాసవంతమైన వస్తువులు కొన్ని కనిపించాయి. రేడియోకార్బన్ డేటింగ్ ద్వారా ఆ సమాధిలోని క్రీస్తుపూర్వం ఏడవ శతాబ్దానికి చెందిందిగా గుర్తించారు. అందులోని ఆనవాళ్లను బట్టి అది మైడస్ సమాధి అని, పక్కన ఉన్న మరో సమాధి అతని తండ్రికి చెందిందని తేల్చారు. టర్కీ రాజధాని అంకారాలోని మ్యూజియంలో 'టుములస్ మైదస్ మౌండ్ ని ప్రదర్శనకు ఉంచారు. తనదురాశతో, మూర్ఖపు ప్రవర్తనతో జనాల్లోనే కాదు.. చరిత్రలోనూ ఓ స్టుపిడ్ కింగ్ గా మిగిలిపోయాడు మైడస్ .
మైడస్ కు గాడిద చెవులు ఎందుకొచ్చాయి.
ప్రచారంలో గోల్డెన్ టచ్ గుణపాఠం నుంచి మైడస్ మారతాడని జనాలు ఆశించారు. కానీ, అతని బుద్ధి మారదు. మళ్లీ విలాసాలతో రాజ్యాన్ని మొదటికి తెస్తాడు. కొన్నివారాల తర్వాత మ్యూజిక్ గాడ్ 'అపోలో'ని అవమానిస్తాడు మైడస్ కింగ్. దీంతో మైడస్ కు గాడిద చెవులు పెరగాలని శపిస్తాడు అపోలో. అప్పటి నుంచి మైడస్ చెవుల్ని మూసుకుని తిరుగుతుంటాడు. మైడస్ చెవుల సంగతి తెలిసిన ఒకేఒక్క వ్యక్తి అతని బార్బర్. అయితే ప్రాణభయంతో ఆ రహస్యం ఎవరికీ చెప్పుడు. ఒకరోజు ఆ బార్బర్ ఊరి అవతలికి వెళ్లి ఒక గుంత తవ్వుతాడు. ఆ గుంతలో 'మైడస్ కి గాడిద చెవులు ఉన్నాయి' అని చెప్తాడు. తర్వాత ఆ గుంతలో ఒక గడ్డిమొక్క మొలుస్తుంది. గాలి వీచినప్పుడు 'మైడస్ రహస్యం' గాలితో పాటు ప్రయాణించి జనాలకి చేరుతుంది. తనకు జరిగిన అవమానం గురించి తెలియడంతో అవమానంతో రగిలిపోతాడు మైడస్. ఆ అవమాన భారంతోనే ఆత్మహత్య చేసుకున్నాడని చరిత్ర కారులు చెబుతున్నారు.