నరేంజేస్తాన్.. అనే శిథిలమైన ప్రాంతంలో జనావాసాలు లేని ఖాళీ ఇళ్లు కనిపిస్తాయి. అది షిరాజ్‌కు పొరుగునే ఉంటుంది. దీన్ని పాత షిరాజ్ అని కూడా అంటారు. ఇది చారిత్రక వాస్తుశిల్పం, పచ్చని తోటలతో కనువిందు చేసే ఊరు. 1970వ దశకంలో ఫ్రెంచ్ రాజధానిని మార్చిన కల్చరల్ సెంటర్ ప్యారిస్‌లోని పాంపిడౌ చూసి ప్రేరణ పొందిన అదెల్ యాజ్ది.. ఇరాన్‌కి చెందిన ఆర్టిస్ట్. ఈ ఊరికి పూర్వ వైభవాన్ని తీసుకురావాలనే ఉద్దేశంతో తన కళా నైపుణ్యాన్ని ప్రదర్శించాడు. గ్రాఫిటీ, ఆయిల్ పెయింటింగ్స్ అరుదుగా కనిపించే షిరాజ్‌లో ఒక కొత్త ప్రయోగం చేశాడు.
పర్షియన్ లేదా ఇస్లామిక్ ఆర్కిటెక్చర్‌పై ఇరాన్ కళాత్మక వారసత్వాన్ని భిన్నంగా చూపించేలా కళాకృతులను రూపొందించాడు. చెప్పాలంటే.. అందుకోసం తనను తాను ఆ ఊరికి అంకితం చేసుకున్నాడు. యాజ్ది అక్కడ ఉండే ఇల్లు కూడా చారిత్రక ప్రదేశాలు, ఎరామ్ గార్డెన్, కవి హఫీజ్ సమాధి వంటివాటిని గుర్తుకు తెస్తుంది. ప్రస్తుతం ఆ ఊరు టూరిస్ట్ అట్రాక్షన్‌గా మారింది. అక్కడికి వెళ్లిన సందర్శకులు అతని కళాత్మక రూపాలను చూసి సంభ్రమాశ్చర్యాలకు గురవుతుంటారు.