రథం వచ్చాక గంగ జాతర మొదలు

ఆదిలాబాద్ జిల్లా, మహారాష్ట్ర సరిహద్దులో పెన్ గంగా జాతర వైభవంగా జరుగుతోంది.రెండు రాష్ట్రాలకు చెందిన భక్తులు నదీలో స్నానాలు చేసి, బోనాలు సమర్పిస్తున్నారు. కరోనా ఎఫెక్ట్ తో మహారాష్ట్ర ప్రభుత్వం జాతరకు అనుమతి ఇవ్వకపోయినా... అక్కడి నుంచి జనం పెద్ద సంఖ్యలో వస్తున్నారు.  నదులకు 12 ఏళ్లకు ఒకసారి పుష్కరాలు వస్తే.. ఆదిలాబాద్ జిల్లా సరిహద్దులో ఉన్న పెన్ గంగా నదికి ఏటా పుష్కర శోభ వస్తుంది. తెలంగాణ,మహరాష్త్ర సరిహద్దుగా ఉన్న ఈ పెన్ గంగా నది... గోదావరి నదికి ఉపనది. ఆదిలాబాద్ జిల్లా జైనథ్ మండలం డొల్లారతో పాటు మహారాష్ట్రలోని పిప్పల్ కోటి దగ్గర ఏటా పుష్యమాసంలో వారం రోజుల పాటు జాతర జరుగుతుంది.వివిధ భాషలు మాట్లాడే వాళ్లంతా నదిని ఆరాదించడం ఈ జాతర ప్రత్యేకత. 150 ఏళ్లుగా పెన్ గంగా నదికి ఏటా పుష్యమాసంలో బోనాలు సమర్పించడం ఆనవాయితీగా వస్తోంది. 

పెన్  గంగ జాతరకు వందల ఏళ్ల చరిత్ర ఉంది. 400 ఏళ్ల కిందట రామానంద తీర్థ మహరాజ్ అనే వ్యక్తి ఈ నది ప్రాంతంలో శివ ధ్యానం చేసేవారు. ఒకసారి రామానంద తీర్థ యజ్ఞం చేస్తుండగా నెయ్యి మాయమైంది. దీంతో ఆయన పెన్  గంగా నీటినే నెయ్యిగా ఉపయోగించి యజ్ఞం పూర్తి చేశారట. ఈ తర్వాత కొంతకాలానికి రామానంద తీర్థ పెన్  గంగలోనే సమాధి అవుతూ… తన శిష్యుడు మాధవ మహారాజ్  ను వారసుడిగా ప్రకటించారు. మాధవ మహారాజ్  కుటుంబంతో పాటు పెన్ గంగా నదీ ప్రాంతంలో ఉంటూ  పరమశివుణ్ని కొలిచేవారు. నది ఒడ్డున శివలింగంతో పాటు రామానంద తీర్థ, మాధవ మహారాజ్   సమాధులు ఉన్నాయి. ఇక్కడికి వచ్చే భక్తులందరూ పెన్  గంగలో స్నానాలు చేసి… శివలింగంతో పాటు గా ఇక్కడి సమాధులను దర్శనం చేసుకొని పూజలు చేస్తుంటారు. 

మహారాష్ట్రలోని బోరి గ్రామం నుంచి రథం వచ్చాక గంగ జాతర మొదలవుతుంది. రథానికి పేలాలు, కుంకుమ-పసుపు, పత్రితో ఆరాధిస్తుంటారు భక్తులు. జాతర కొనసాగే వారం రోజులు ఈ రథం నదీ పరివాహక ప్రాంతంలో ఉంచి పూజలు చేస్తారు. పెన్ గంగా కి వచ్చిన భక్తులు భక్తి శ్రద్దలతో పుణ్య స్నానాలు ఆచరించి నైవేద్యాలు సమర్పిస్తుంటారు. పెరుగు అన్నం, తియ్యటి పరమాన్నం, అప్పం-గారెలు వంటి అనేక రకాల పిండి వంటలు తయారు చేస్తారు.  నది పారే చోట కొన్ని చిన్న చిన్న రాళ్లకు పూజలు చేసి, ప్రత్యేకంగా తయారు చేసిన పిండి వంటలు తెప్పలో ఉంఛి గంగలో వదిలేస్తుంటారు. ఇలా చేస్తే సర్వపాపాలు, రోగాలు నయమౌతాయని భక్తుల నమ్మకం.జాతర ప్రాంతంలో ఎగ్జిబిషన్, దుకాణాలు, సినిమా టాకీస్ లు వెలిశాయి. కరోనా ఎఫెక్ట్ తో మహారాష్ట్ర సర్కార్ జాతరకి అనుమతి ఇవ్వలేదు. అయినా అక్కడి నుంచి భక్తులు వస్తూనే ఉన్నారు. భక్తజన స్రందంతో పెన్ గంగ జాతర సందడిగా మారింది. జాతర ప్రాంతంలో కనీస సౌకర్యాలు లేవని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు భక్తులు. ఎండ్ వాయిస్: పరవళ్ళు తొక్కుతున్న పెన్ గంగా నది... చల్లని గాలులు, ఇసుక తిన్నెలు జాతరకు వచ్చే భక్తులను ఆహ్లాదాన్ని పంచుతున్నాయి. 

ఇవి కూడా చదవండి: 

బండి సంజయ్ అరెస్ట్ ఎపిసోడ్.. బీసీ కమిషన్ విచారణ

ఎన్నికలు వస్తేనే ఉద్యోగ నోటిఫికేషన్లు గుర్తుకొస్తయా?