Current Topic : బిట్ బ్యాంక్... కుతుబ్​షాహీలు

  • క్రీ.శ. 1518లో స్వతంత్రాన్ని ప్రకటించుకుని, గోల్కొండ రాజధానిగా రాజ్యాన్ని పాలించిన కుతుబ్​షాహీ వంశ మొదటి పాలకుడు కులీ కుతుబ్​ ఉల్​ ముల్క్.
  • చివరి ఢిల్లీ సుల్తాన్​ ఇబ్రహీం లోడి, మొఘల్​ వంశ స్థాపకుడైన బాబర్​కు సమకాలీనుడైన గోల్కొండ సుల్తాన్​ కులీ కుతుబ్​ ఉల్​ ముల్క్​.
  • గోల్కొండ కోట పరిసరాల్లో కులీ కుతుబ్​ ఉల్​ ముల్క్​ నిర్మించిన కొత్త నగరం మహమ్మద్​ నగర్​. 
  • క్రీ.శ.1529లో కులీ కుతుబ్​ షా విజయనగర సైన్యాన్ని ఓడించాడు. 
  • కులీ కుతుబ్​ షా విజయాలతో గోల్కొండ రాజ్యం తెలంగాణలోని కోహీర్​, వరంగల్​, నల్లగొండ నుంచి తీరాంధ్రలోని మచిలీపట్నం వరకు విస్తరించింది. 
  • కులీ కుతుబ్​ షాను 99వ ఏట అతని కొడుకు జంషీద్​ కులీ హత్య చేశాడు. 
  • జంషీద్​ కులీ గోల్కొండ రాజ్యాన్ని 1543 నుంచి 1550 వరకు పాలించాడు.
  •  విజయనగర చక్రవర్తి సదాశివరాయలు, ప్రధాని అళియరామరాయలు మద్దతుతో గోల్కొండ చేరి, శత్రువులను ఓడించి సింహాసనాన్ని కులీ కుతుబ్​ షా ఆరో కుమారుడు ఇబ్రహీం కులీ కుతుబ్​ షా అధిష్టించాడు.
  • ఇబ్రహీం పరిపాలనా కాలాన్ని ది కింగ్​డం ఎట్​ ఇట్స్​ హైట్​ అని ప్రముఖ చరిత్రకారుడు హరున్​ఖాన్​ షేర్వాని తన ప్రసిద్ధ రచన హిస్టరీ ఆఫ్​ కుతుబ్​ షాహీ డైనాస్టిలో అభివర్ణించాడు. 
  • క్రీ.శ.1565లో దక్కన్​ సుల్తాన్​లకు విజయనగర సేనలకు మధ్య కృష్ణానదీ తీరంలో రాక్షసి తంగిడి యుద్ధం జరిగింది. ఈ యుద్ధంలో దక్కన్​ సుల్తాన్​లు విజయం సాధించారు.
  • ఇబ్రహీం కులీ కుతుబ్​ షా కాలంలో నిర్మించిన ముఖ్యమైన చెరువులు హుస్సేన్​ సాగర్​, ఇబ్రహీంపట్నం చెరువు.
  • ఇబ్రహీం కులీ కుతుబ్​ షాను కవులు మల్కిభరాముడు అని కీర్తించారు.
  • ఇబ్రహీం కులీ కుతబ్​ షా ఆదరణ పొందిన ప్రముఖ తెలుగు కవులు అద్దంకి గంగాధరుడు, కందుకూరి రుద్రకవి.
  • తపతీ సంవరణపోఖ్యానం అనే గ్రంథాన్ని అద్దంకి గంగాధరుడు రచించాడు.
  • నిరంకుశోపాఖ్యానాన్ని కందుకూరి రుద్రకవి రచించాడు.
  • ఇబ్రహీం కులీ కుతుబ్​ షా క్రీ.శ.1580లో మరణించాడు. అతని తర్వాత మహమ్మద్​ కులీ కుతుబ్​ షా సింహాసనం అధిష్టించాడు. అప్పటికి అతని వయసు 14 సంవత్సరాలు.
  • హరున్​ఖాన్​ షేర్వాణీ తన రచన హిస్టరీ ఆఫ్​ కుతుబ్​షాహీ డైనాస్టీలో మహమ్మద్​ కులీ కుతుబ్​ షా పాలనను కల్చరల్​ ఆఫ్​ లిఫ్ట్​గా వర్ణించాడు. 
  • మహమ్మద్​ కులీ కుతుబ్​ షా దక్కనీ, ఉర్దూ భాషల్లో దిట్ట. మొఘల్​ చక్రవర్తి అక్బర్​తో స్నేహ పూర్వక దౌత్య సంబంధాలు నెరిపాడు.
  • మొఘల్​ చక్రవర్తి జహంగీర్​తో మహమ్మద్​ ​ కులీ కుతుబ్​ షా యుద్ధం చేశాడు. 
  • ఇతని కాలంలో ఇరాన్​ నుంచి అనేక మంది కవులు, కళాకారులు, వర్తకులు, మేధావులు  వచ్చి హైదరాబాద్​లో స్థిరపడ్డారు. 
  • ఇరాన్​ నుంచి వలస వచ్చి క్రీ.శ.1581లో మహమ్మద్​ కులీ కుతుబ్​ షా కొలువులో మీర్​ మొమిన్​ అస్ట్రాబాదీ చేరాడు.
  • గోల్కొండ సుల్తానుల్లో విశేష కీర్తిగడించిన మహమ్మద్​ కులీ కుతుబ్​ షా క్రీ.శ.1612 నవంబర్ 11న మరణించాడు.
  • మహమ్మద్​ కులీ కుతుబ్​ షా అనంతరం ఆయన మేనల్లుడు సుల్తాన్​ మహమ్మద్​ కుతుబ్​ షా సింహాసనం అధిష్టించాడు.
  • సుల్తాన్​ మహమ్మద్​ కుతుబ్​ షా కాలంలో మాసాహిబా తాలాబ్​ను నిర్మించారు.
  • సుల్తాన్​ మహమ్మద్​ కుతుబ్​ జిల్లులా పేరుతో కవిత్వం రచించాడు. 
  • సుల్తాన్​  కుతుబ్​ షా కాలంలో డచ్​ వారు మచిలీపట్నం, నిజాంపట్నం, పులికాట్​ పట్టణాల్లో వర్తక స్థావరాలు ఏర్పరచుకున్నారు.
  • సుల్తాన్​ మహమ్మద్​ కుతుబ్​ షా కాలంలో ఇంగ్లీష్​ వారు మచిలీపట్నం, పులికాట్​, నాగపట్నం ప్రాంతాల్లో వర్తక స్థావరాలు ఏర్పరుచుకున్నారు. 
  • అబ్దుల్లా కుతుబ్​ షా తన తండ్రి మరణానంతరం సింహాసనం అధిష్టించే నాటికి వయసు 12 సంవత్సరాలు.
  • అబ్దుల్లా కుతుబ్​ షా కాలంలో గోల్కొండ రాజ్యంపై మొఘల్​ చక్రవర్తులు షాజహాన్​, ఔరంగజేబ్​ నిరంతరం దాడులు జరిపారు.
  • క్రీ.శ.1636లో మొఘల్​ చక్రవర్తి షాజహాన్​ సేనలకు తలొగ్గి ఇంకియాద్​ నామాపై అబ్దుల్లా కుతుబ్​ షా సంతకం చేశాడు.
  • గోల్కొండ కుతుబ్​ షాహీల పాలకుల్లో చివరి వాడు అబుల్​ హసన్​ తానీషా.
  • అబుల్​ హసన్​ తానీషాకు  సమకాలీనుడైన మరాఠా యోధుడు శివాజీ.
  • అబుల్​ హసన్​ తానీషాకు సమకాలీనుడైన మొఘల్​ చక్రవర్తి ఔరంగజేబ్​.
  • తానీషా కాలంలో గోల్కొండ రాజ్యం మొఘల్​ సామ్రాజ్యంలో అంతర్భాగమైంది.
  • క్రీ.శ.1647లో గోల్కొండ రాజ్య మీర్​జుమ్లాగా పదవిని మాదన్న చేపట్టాడు.
  • అక్కన్న, మాదన్నలు హత్య చేయబడిన సంవత్సరం 1686.
  • నమ్మకద్రోహంతో గోల్కొండ దుర్గ ద్వారాన్ని ఔరంగజేబ్​ సేనలకు తెరిచిన కుతుబ్​షాహి అధికారి అబ్దుల్లా ఫణి.