
- కుతుబ్‌షాహీల కాలంలో రాజ్యాదరణ పొందిన భాషలు పర్షియన్, అరబిక్, ఉర్దూ.
- మల్కిభరామునిగా కొనియాడబడిన గోల్కొండ సుల్తాన్ ఇబ్రహీం కులీకుతుబ్ షా.
- ఇబ్రహీం కులీ కుతుబ్‌షా ఆదరణ పొందిన తెలుగు కవి అద్దంకి గంగాధర కవి.
- అద్దంకి గంగాధర కవి తన తపతీ సంవరణోపాఖ్యానం గ్రంథాన్ని ఇబ్రహీం కులీకుతుబ్ షాకు అంకితమిచ్చారు.
- ఇబ్రహీం కులీకుతుబ్‌షా చింతలపాలెం గ్రామాన్ని రుద్రకవికి దానంగా ఇచ్చారు.
- పొన్నగంటి తెలగనార్యుడిని ఆదరించిన పఠాన్‌చెరువు ప్రాంత అధికారి అమీన్ ఖాన్.
- పొన్నగంటి తెలగనార్యుడు అమీన్ ఖాన్‌కు అంకితం ఇచ్చిన గ్రంథం యయాతి చరిత్ర.
- అచ్చ తెలుగులో రాసిన మొదటి తెలుగు గ్రంథం యయాతి చరిత్ర.
- మహమ్మద్ కులీ కుతుబ్ షా ఆస్థాన కవి గణేశ పండితుడు.
- గోల్కొండ కరణంగా పనిచేసిన మహ్మద్ కులీ కుతుబ్ షా కాలం నాటి తెలుగు కవి సారంగతమ్మయ్య.
- సారంగతమ్మయ్య రచన వైజయంతీ విలాసం.
- అబ్దుల్లా కుతుబ్‌షా సమకాలీనుడు, ఆయన ఆస్థానాన్ని సందర్శించి, ఆయనపై 1000కి పైగా పదకీర్తనలు పాడిన తెలుగు పద కవితా పితామహుడు క్షేత్రయ్య.
- భక్తరామదాసుగా కీర్తించబడిన కంచర్ల గోపన్న, అబుల్ హసన్ తానీషా కాలంలో ఖమ్మం ప్రాంతానికి తహసీల్దార్ గా పనిచేశాడు.
- దాశరథీ శతకాన్ని రచించింది భక్తరామదాసు.
- మధ్యయుగ వాస్తు శిల్పకారుల పనితనానికి మచ్చు తునక అయిన చార్మినార్‌ను మహమ్మద్ కులీకుతుబ్‌షా క్రీ.శ.1590–91లో నిర్మించాడు.
- గోల్కొండ సుల్తానుల్లో గొప్ప వాస్తు కళాభిమాని మహమ్మద్ కులీకుతుబ్ షా.
- మహమ్మద్ కులీ కుతుబ్‌షా హైదరాబాద్ నగర నిర్మాణాన్ని క్రీ.శ.1590–91లో ప్రారంభించారు.
- హైదరాబాద్ నగర నిర్మాణంలో మహమ్మద్ కులీ కుతుబ్‌షాకు అన్ని విధాల సహకరించిన వ్యక్తి మీర్ మొమీన్ మహమ్మద్ అస్ట్రాబాదీ.
- మీర్ మోమీన్ హైదరాబాద్ నగర నిర్మాణాన్ని ఇరాన్‌లోని ఇస్పాన్ ఇ నౌ పట్టణం నమూనాలో నిర్మించాలని ప్రణాళిక రచించాడు.
- ఇరాన్‌లోని సఫాయిద్ నగరంలోని మైదాన ఇ నక్షజహాన్ కూడలిగా చార్మినార్‌ను రూపొందించారు.
- చార్మినార్‌కు ఉత్తర దిశన 80 గజాల దూరంలో కట్టించిన అద్భుత నిర్మాణం చార్‌కమాన్ లేదా జూలూఖానా.
- సుల్తాన్ మహమ్మద్ కులీ కుతుబ్ షా కాలంలో క్రీ.శ. 1595లో దారుషిఫా వద్ద యునాని హాస్పిటల్‌ను నిర్మించాడు.
- గోల్కొండ కోటను పాత మట్టికోట స్థానంలో రాతి కోటను సుల్తాన్ కులీ కుతుబ్‌షా నిర్మించాడు.
- గోల్కొండ కోటకు 87 బురుజులు, 8 దర్వాజాలు కట్టించింది ఇబ్రహీం కులీ కుతుబ్ షా.
- గోల్కొండ పాత కోట చుట్టూ 7 కిలోమీటర్ల రాతికోటను ఇబ్రహీం కులీ కుతుబ్‌షా నిర్మించాడు.
- గోల్కొండ కోట దర్వాజాల్లో ఫతే దర్వాజ ముఖ్యమైంది.
- గోల్కొండ కోట ఔరంగజేబు వశమైన తేదీ 1687, సెప్టెంబర్ 21.
- మూసీనదిపై పురానాపూల్ వంతెనను క్రీ.శ.1578లో ఇబ్రహీం కులీ కుతుబ్‌షా నిర్మించాడు.
- పురాన్‌పూల్ ను ప్రేమ వంతెన (బ్రిడ్జ్ ఆఫ్ లవ్)గా క్రీ.శ.1676లో ఫ్రెంచి యాత్రికుడు టావెర్నియర్ వర్ణించాడు.
- పురానాపూల్‌ను టావెర్నియర్ పారిస్‌లోని పాంట్ నీఫ్ అందంతో పోల్చాడు.
- హుస్సేన్‌సాగర్‌ను క్రీ.శ.1562లో ఇబ్రహీం కులీకుతుబ్‌షా అల్లుడు హుస్సేన్ షా వలీ నిర్మించాడు.
- హుస్సేన్‌సాగర్‌కు బలక్‌పూర్ నది నుంచి నీరు వచ్చేది.
- మక్కా మసీదు నిర్మాణం క్రీ.శ.1614లో మహమ్మద్ కుతుబ్ కాలంలో ప్రారంభమైంది.
- మక్కా మసీదు నిర్మాణం క్రీ.శ.1693లో పూర్తయింది.
- దక్కన్లో అతిపెద్ద మసీదు మక్కా మసీదు.
- మక్కా మసీదు నిర్మాణానికి ప్రణాళిక రూపొందించిన వారు సుల్తాన్ అధికారి మీర్ఫజీ ఉల్లాబేగ్, చౌదరి రాజయ్య.
- మక్కా మసీదులోని ఏకశిలా నిర్మాణం మెహరబ్.
- కుతుబ్ షాహీల సమాధులను గోల్కొండ కోటకు కిలోమీటరు దూరంలో బంజారా దర్వాజ వద్ద నిర్మించారు.
- కుతుబ్ షాహీ రాజ కుటుంబ స్త్రీల్లో విశిష్ట స్థానం పొందినవారు మహమ్మద్ కులీ కుతుబ్‌షా ఏకైక కుమార్తె హయత్ బక్ష్ బేగం.