![బిట్ బ్యాంక్: తెలంగాణ పరిశ్రమలు](https://static.v6velugu.com/uploads/2024/01/history-of-telangana-industries_rz3nbNPoxG.jpg)
తెలంగాణ రాష్ట్రంలో అత్యధిక పరిశ్రమలు మేడ్చల్ జిల్లాలో ఉన్నాయి.
అత్యల్ప పారిశ్రామిక యూనిట్లు ములుగు జిల్లాలో ఉన్నాయి.
రాష్ట్రంలో మొత్తం మరమగ్గాల సంఖ్య 41,556.
తెలంగాణ నుంచి వాణిజ్య వస్తువులను అత్యధికంగా అమెరికా దిగుమతి చేసుకుంటోంది.
దేశంలో మొదటి చక్కెర పరిశ్రమ 1903లో ఏర్పడింది.
తెలంగాణలో మొదటి చక్కెర పరిశ్రమను 1937లో స్థాపించారు.
తెలంగాణలో మొదటి షుగర్ ఫ్యాక్టరీ నిజాం షుగర్స్ ఫ్యాక్టరీ.
తెలంగాణలో పరిశ్రమల ద్వారా 56 లక్షల మంది ఉపాధి పొందుతున్నారు.
నిజాం షుగర్స్ ఫ్యాక్టరీ శక్కర్ నగర్ ప్రాంతంలో స్థాపించారు.
ముత్యంపేట షుగర్స్ ఫ్యాక్టరీని 1981లో స్థాపించారు.
సారంగపూర్ షుగర్ ఫ్యాక్టరీ నిజామాబాద్ జిల్లాలో ఉంది.
చక్కెర ఉత్పత్తిలో క్యూబా ప్రథమ స్థానంలో ఉంది.
అజంజాహీ మిల్లు 1934లో స్థాపించారు.
అజాంజాహీ మిల్లు వరంగల్ లో స్థాపించారు.
1990లో అజాంజాహీ మిల్లు మూతపడింది.
సంఘీ వస్త్ర పరిశ్రమ రంగారెడ్డి జిల్లాలో ఉంది.
పెంగ్విన్ వస్త్ర పరిశ్రమ మేడ్చల్ జిల్లాలో ఉంది.
గ్రోవర్స్ సహకార స్పిన్నింగ్ మిల్‌ను 1980లో స్థాపించారు.
సూర్యలక్ష్మి కాటన్ మిల్లు ఆమన్‌గల్ ప్రాంతంలో ఉంది.
తెలంగాణ స్పిన్నింగ్ మిల్లు బాలానగర్ లో స్థాపించారు.
వజీర్ సుల్తాన్ టోబాకో కంపెనీ 1930లో స్థాపించారు.
వజీర్ సుల్తాన్ టోబాకో కంపెనీ అజామాబాద్ ప్రాంతంలో ఉంది.
చార్మినార్ సిగరెట్స్‌ను వజీర్ సుల్తాన్ టోబాకో కంపెనీ తయారు చేస్తోంది.
నటరాజ్ స్పిన్నింగ్ మిల్ నిర్మల్ జిల్లాలో ఉంది.
గ్రోవర్ స్పిన్నింగ్ మిల్ ఆదిలాబాద్ జిల్లాలో ఉంది.
పట్టు వస్త్ర పరిశ్రమకు గద్వాల్, పోచంపల్లి, సిరిసిల్ల ప్రాంతాలు ప్రసిద్ధి.
రాష్ట్రంలో తొలి కాగితం పరిశ్రమను1938లో ప్రారంభించారు.
రాష్ట్రంలో అతిపెద్ద కాగితం పరిశ్రమ సిర్పూర్ పేపర్ మిల్స్.
ఏపీ రేయాన్స్ లిమిటెడ్ వరంగల్ జిల్లాలోని కమలాపురంలో ఉంది.
చార్మినార్ పేపర్ మిల్స్ మాతంగి ప్రాంతంలో ఉంది.
నాగార్జున పేపర్ మిల్స్ పటాన్చెరువు ప్రాంతంలో ఉంది.
దేశంలో మొదటి కాగితం పరిశ్రమను 1932లో స్థాపించారు.
కాగితాన్ని అధికంగా మహారాష్ట్ర ఉత్పత్తి చేస్తోంది.
జమ్మికుంటలో లెదర్ పార్క్‌ను స్థాపించారు.
దక్షిణాసియాలో మొదటి స్పాంజ్ ఐరన్ పరిశ్రమను పాల్వంచలో స్థాపించారు.
దేశంలో మొదటి ఇనుము, ఉక్కు పరిశ్రమను జంషెడ్‌పూర్‌లో స్థాపించారు.
తెలంగాణలోని మొదటి సిమెంట్ ఫ్యాక్టరీని 1958లో స్థాపించారు.
కేశోరామ్ సిమెంట్స్ పెద్దపల్లి జిల్లాలో ఉంది.
రాశి సిమెంట్స్ నల్లగొండ జిల్లాలోని వాడపల్లిలో ఏర్పాటు చేశారు.
దక్కన్ సిమెంట్స్ కంపెనీ సూర్యాపేట హుజూర్నగర్ జిల్లాలో ఉంది.
సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ కొత్తగూడెం జిల్లాలో ఉంది.
హైదరాబాద్ ఆస్బెస్టాస్ పరిశ్రమ సనత్‌నగర్ ప్రాంతంలో స్థాపించారు.
ఇండియన్ హ్యూమ్ పైప్ ఫ్యాక్టరీ అజామాబాద్ ప్రాంతంలో ఉంది.
మహా సిమెంట్స్ కంపెనీ సూర్యాపేట జిల్లాలో ఉంది.
తోళ్ల ఉత్పత్తిలో తమిళనాడు రాష్ట్రం మొదటి స్థానంలో ఉంది.
సూర్య వంశ స్పిన్నింగ్ మిల్ భువనగిరి జిల్లాలో ఉంది.
నోవోపాన్ ఇండియా లిమిటెడ్ (ప్లైవుడ్ పరిశ్రమ) పటాన్చెరువు ప్రాంతంలో ఉంది.
ప్రస్తుతం దేశంలో అతిపెద్ద ఇనుము– ఉక్కు కర్మాగారం టీఐఎస్సీఓ.
1953లో హిందుస్థాన్ మెషిన్ టూల్స్ స్థాపించారు.
హిందుస్థాన్ మెషిన్ టూల్స్ దేశంలో మొదటిసారిగా బెంగళూరు ప్రాంతంలో స్థాపించారు.
హైదరాబాద్‌లోని హెచ్ఎంటీలో ఎలక్ట్రిక్ బల్బులు తయారు చేస్తారు.
ప్రాగా టూల్స్ లిమిటెడ్ కవాడిగూడ ప్రాంతంలో ఉండేది.
సిమెంట్ ఉత్పత్తిలో ప్రపంచంలో భారతదేశం రెండో స్థానంలో ఉంది.
దేశంలో మొదటి సిమెంట్ కంపెనీని 1904లో స్థాపించారు.
పింజోర్ హెచ్ఎంటీ ప్లాంట్‌లో ట్రాక్టర్లు ఉత్పత్తి చేస్తున్నారు.
భోపాల్ ప్రాంతంలో మొదటి భారత్ హెవీ ఎలక్ట్రిక్స్ లిమిటెడ్ పరిశ్రమను స్థాపించారు.