
- గద్వాల సంస్థానం కృష్ణా, తుంగభద్ర నదుల మధ్య ఉండేది. సంస్థానాల రద్దు నాటికి గద్వాల సంస్థానం పాలనా కాలం 600 సంవత్సరాలు. ఈ సంస్థానం సముద్ర మట్టానికి 1063 అడుగుల ఎత్తున ఉండేది. వార్షిక ఆదాయం రూ.10లక్షలు.
- గద్వాల సంస్థానాధీశులు పాకనాటి రెడ్లు. ముష్టిపల్లి వంశానికి చెందిన వారు. వీరు వైష్ణవ మతం అనుసరించారు.
- గద్వాల సంస్థానాధీశుల ప్రథమ రాజధాని పూడూరు. వీరు కులదైవం చెన్నకేశవస్వామి. గద్వాల రాజ పత్రాల్లో పూడూరును కేశవ నగరం పేరుతో వ్యవహరించారు.
- గద్వాల సంస్థానానికి మూలపురుషుడు పోలనిరెడ్డిగా పిలువబడే బుడ్డారెడ్డి. గద్వాల సంస్థానాధీశులకు నాడౌగడ్, సర్ నాడగౌడ అనే బిరుదులు ఉండేవి.
- గద్వాల సంస్థానానికి ఆద్యుడు రాజా శోభానాద్రి. చివరి పాలకురాలు మహారాణి ఆదిలక్ష్మీ దేవమ్మ. ఈమె ఆస్థాన కవి పోకూరి కాశీపతి.
- మాఘ మాసంలో కవి గాయకులను సన్మానించే సంప్రదాయాన్ని పెద సోమభూపాలుడు ప్రారంభించాడు.
- పౌండీరకం అనే ప్రబంధాన్ని ఆదిపూడి ప్రభాకర కవి, గద్వాల సంస్థాన చరిత్రను పెద్దమందడి వేంకటకృష్ణ కవి రచించారు.
- గద్వాల సంస్థానాధీశులతో ఆంధ్రనాటక పితామహ అనే బిరుదును పొందిన కవి ధర్మవరం కృష్ణమాచార్యులు.
- వనపర్తి సంస్థానం వైశాల్యం 450 చదరపు మైళ్లు. గ్రామాలు 124.
- వనపర్తి సంస్థానం తొలి రాజధాని నూగూరు. ఈ సంస్థానాన్ని పాలించిన మొటాటిరెడ్డి వంశీయుల మూలపురుషుడు కృష్ణభూపతి.
- వనపర్తి సంస్థానాధీశుల ఇంటి పేరు జనుంపల్లి. సంస్థానాన్ని పాలించిన మొదటి వ్యక్తి రామకృష్ణారావు.
- వనపర్తి సంస్థానాధీశుల్లో బహిరీ బిరుదును గోపాల రాయలు పొందారు. ఢిల్లీ సుల్తాన్‌తో సవై బిరుదు పొందిన వనపర్తి సంస్థానాధీశుడు వెంకటరెడ్డి.
- తాను దత్తత తీసుకున్న గోపాలరాయల పేరిట గోపాల పేట గ్రామాన్ని నిర్మించిన వనపర్తి సంస్థానాధీశుడు వెంకటరెడ్డి.
- వనపర్తి సంస్థాన పాలకుల్లో ప్రసిద్ధుడు మొదటి రామకృష్ణారావు. 1817లో నిజాం ప్రభువు నుంచి రాజబహద్దూర్ బిరుదు పొందిన వనపర్తి పాలకుడు రామకృష్ణారావు.
- బ్రిటీష్ వారి పాలనా పద్ధతులను ఆకళింపు చేసుకొని సంస్థానంలో శాశ్వత పన్ను విధానాన్ని అమలు పరిచిన వనపర్తి సంస్థాన పాలకుడు మొదటి రాజా రామేశ్వరరావు.
- రాణి సరళాదేవి పేరిట నిర్మించిన తటాకం సరళసాగర్.
- వనపర్తి సంస్థానం హైదరాబాద్ రాష్ట్రంలో కలిసిన తర్వాత పార్లమెంట్ సభ్యుడైన రాణి సరళాదేవి కుమారుడు రాజా రామేశ్వరరావు.
- అష్ట భాషా కవి అనే బిరుదు కలిగిన వనపర్తి సంస్థాన పాలకుడు రాజా బహిరీ గోపాలరాయలు.
- మహబూబ్‌నగర్ జిల్లాలోని ఆత్మకూరు సంస్థానం అమరచింత సంస్థానం పేరుతో వర్ధిల్లింది. సంస్థానం వైశాల్యం 190 చదరపు మైళ్లు. తొలి రాజధాని తివుడంపల్లి. తర్వాత రాజధాని ఆత్మకూరు.
- జటప్రోలు సంస్థానం మహబూబ్‌నగర్ జిల్లాలో ఉంది. జటప్రోలు సంస్థానాధీశులు పద్మనాయక వంశీయులు. వీరి ఇంటి పేరు సురభి.
- సురభి వంశ పద్మనాయకుల మూలపురుషుడు సర్వజ్ఞ సింగభూపాలుడు.
- జటప్రోలు సంస్థానాన్ని విజయనగర రాజు అళియరామరాయల నుంచి కానుకగా పొందింది సురభి మాధవరాయలు.
- సురభి మాధవ రాయలు చంద్రికా పరిణయం అనే ప్రబంధ కావ్యం రచించారు.
- సురభి వంశీయులు 1840లో లక్ష్మణరాయలు కాలంలో తమ రాజధానిని జటప్రోలు నుంచి కొల్లాపూర్‌కు మార్చారు.
- కొల్లాపూర్ సంస్థానం చివరి పాలకుడు వెంకట జగన్నాథరావు.
- పాపన్నపేట సంస్థానం ఫిరోజ్‌షా తుగ్లక్ ఢిల్లీ సుల్తాన్‌గా ఉన్న రోజుల్లో ఏర్పరచబడింది.
- పాపన్నపేట సంస్థాన పాలకుల్లో ప్రసిద్ధి చెందిన మహిళా పాలకురాలు రాయ్ బగన్ రాణి శంకరమ్మ.
- పాపన్నపేట సంస్థాన 12వ పాలకురాలు రాణి శంకరమ్మకు నిజాం ప్రభుత్వం ఇచ్చిన బిరుదు రాయ్బాగన్ (ఆడ సింహం).
- పాపన్నపేట సంస్థానాధీశుల్లో ప్రముఖుడు సదాశివారెడ్డి.
- పాపన్నపేట సంస్థానాధీశులు కట్టించిన కోటలు సంగారెడ్డి, వెలమకన్నె, రామాయమ్మపేట.
- పాపన్నపేట సంస్థానాధీశులకు ఉన్న బిరుదు చార్హజార్.
- దోమకొండ సంస్థానం నిజామాబాద్ జిల్లాలో ఉంది. ఈ సంస్థానాన్ని తొలుత బిక్కవోలు పేరుతో వ్యవహరించేవారు.
- బిక్కవోలును ప్రస్తుతం బిక్నూరు పేరుతో పిలుస్తున్నారు.
- దోమకొండ సంస్థానాధీశుల వంశానికి ఆద్యుడు కామినేడు.
- దోమకొండ సంస్థానాధీశుల కులదైవం బిక్కవోలులో వెలసిన సిద్ధరామేశ్వర స్వామి.
- కామినేడు గోల్కొండ సుల్తానుల నుంచి మెదకు సీమలోని బిక్కవోలు పొందాడు.
- దోమకొండ సంస్థానాధీశుల మూల పరుషుడు కామినేడు లేదా కామారెడ్డి పేరిట కామారెడ్డి పట్టణం నిర్మించారు.
- సంస్థాన రాజధానిని బిక్కవోలు నుంచి కామారెడ్డి పేటకు మార్చిన దోమకొండ సంస్థాన పాలకుడు రాజన్నచౌదరి.
- రాజధానిని కామారెడ్డి నుంచి దోమకొండకు మొదటి రాజేశ్వరరావు మార్చాడు.
- అమరచింత సంస్థానాధీశులు పాకనాటి రెడ్డి వంశానికి చెందినవారు. వీరి ఇంటి పేరు ముక్కర. మూలపురుషుడు గోపాలరెడ్డి.
- క్రీ.శ.1292లో గోపాలరెడ్డిని వర్ధమానపురాని(వడ్డెమాను)కి పాలకునిగా గోన బుద్ధారెడ్డిని నియమించింది.