- కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వ్యాఖ్య
న్యూఢిల్లీ, వెలుగు: జమ్మూలో బీజేపీ ఎక్కువ సీట్లు సాధించడం చారిత్రా త్మకమని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు. జమ్మూ ప్రాంతంలోని 43 అసెంబ్లీ స్థానాల్లో.. బీజేపీ 29 స్థానా లు గెలుచుకుందని మంగళ వారం ఓ ప్రకటనలో తెలిపారు. ఆ ఏరియా లో కాంగ్రెస్ మాత్రం ఒక్క సీటు గెలు చుకోలేదని వెల్లడించారు. మోదీపై ప్రజలకున్న విశ్వా సాన్ని ఎన్నికల ఫలితాలు స్పష్టం చేశాయన్నారు.