
హీరో నాని ‘హిట్ : ది థర్డ్ కేస్’మూవీ రేపు (మే1న) థియేటర్లలోకి రానుంది. డైరెక్టర్ శైలేష్ కొలను దర్శకత్వంలో రానున్న ఈ క్రైమ్ థ్రిల్లర్ పై భారీ అంచనాలున్నాయి. అలాగే, హీరో నాని సినిమా కావడంతో ఆ అంచనాలు మరింత పెరిగాయి.
టీజర్, ట్రైలర్ తోనే నాని తన మార్క్ని చూపించడంతో, మూవీ ఫస్ట్ డే వసూళ్లు బ్లాస్ట్ అయ్యేలా ఉండనుందని టాక్ వినిపిస్తోంది. ఈ క్రమంలోనే హిట్ 3 ఫస్ట్ డే వసూళ్లు రూ.40కోట్ల గ్రాస్ రాబొట్టచ్చనే ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ముందస్తు అంచనాలకు తగ్గట్టుగా ఫస్ట్ డే రూ.40 కోట్ల మార్క్ సాధిస్తే.. ఇది నాని కెరీర్లో బిగ్గెస్ట్ ఓపెనింగ్ మూవీగా నిలిచిపోతుంది.
►ALSO READ | HIT 3 Ticket Prices: పెరిగిన హిట్ 3 టికెట్ల ధరలు.. ప్రభుత్వం ఎంత పెంచిందంటే?
నాని నటించిన 'దసరా' తొలి రోజు ప్రపంచవ్యాప్తంగా రూ.38 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. ఇప్పటివరకు నాని నటించిన సినిమాలలో ఇదే రికార్డు స్థాయి ఓపెనింగ్. ఇక హిట్ 3తో ఆ లెక్కను క్రాస్ చేసే ఛాన్స్ ఉంది. అందుకు కారణం లేకపోలేదు.. నాని సక్సెస్ పరంపరలో తన సినిమాలపై ప్రేక్షకుల్లో హైప్ పెరుగుతూనే ఉంది. ఎక్కడా తగ్గట్లేదు. అందువల్ల హిట్ 3 దాన్ని దాటేసి, నానికి కొత్త ఓపెనింగ్ రికార్డు ఇస్తుందనే ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి.
ఇకపోతే, ఈ మూవీకి భారీ స్థాయిలో అడ్వాన్స్ బుకింగ్స్ జరుగుతున్నాయి. హైదరాబాద్ లో అయితే, అంచనాలకు మించి టికెట్స్ తెగుతున్నాయి. యూత్లో నానికి పిచ్చా క్రేజ్ ఉండటంతో వీకెండ్ మొత్తం టికెట్స్ తెంపేస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా మిగతా భాషల్లో కూడా ఇదే మాదిరిగా బుకింగ్స్ జరుగుతున్నాయి. ఓవర్సీస్లో సైతం బుకింగ్స్ మోత మోగిపోతుంది.
ప్రపంచవ్యాప్తంగా ఈ మూవీ రూ.49 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగినట్లు సినీ వర్గాల సమాచారం. అంటే, హిట్ 3 మూవీ రూ.50కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో బాక్సాఫీస్ బరిలో నిలువనుంది. హిట్ 3 థియేట్రికల్, నాన్ థియేట్రికల్ కలిపి రూ.100కోట్లకు పైగా బిజినెస్ జరిగినట్టు తెలుస్తోంది. నాని కెరియర్లో అత్యధిక బిజినెస్ జరుపుకున్న మూవీగా హిట్ 3 నిలిచింది. ఈ మూవీని వాల్ పోస్టర్ సినిమా పతాకంపై హీరో నానినే నిర్మించారు.
A SARKAAR PROMISE ❤🔥
— Wall Poster Cinema (@walpostercinema) April 27, 2025
Will be kept 💥💥#HIT3 mayhem begins from May 1st.
Book your tickets now!
🎟️ https://t.co/8HrBsV0jIt#AbkiBaarArjunSarkaar pic.twitter.com/xYUxIr9rSq
ఇందులో అర్జున్ సర్కార్ అనే సీరియస్ పోలీస్ ఆఫీసర్‌గా నాని నటించారు. గతంలో ఎప్పుడు లేనంత వైలెంట్ క్యారెక్టర్ చేశారు. దర్శకుడు శైలేష్ కొలను టేకింగ్ టీజర్, ట్రైలర్ ను బట్టి అదిరిపోయింది. యాక్షన్ సినిమాలని ఎంజాయ్ చేసే ప్రేక్షకులకు ఇది ఫుల్ మీల్స్గా ఉండనుంది. అయితే, ఇందులో తమిళ స్టార్ హీరో కార్తీ క్యామియో రోల్‍లో కనిపించనున్నారనే రూమర్లు వైరల్ అవుతున్నాయి.రేపు సినిమా చూశాక తెలిసిపోతుంది.