
నేచురల్ స్టార్ నాని నటించిన లేటెస్ట్ మూవీ ‘హిట్ : ది థర్డ్ కేస్’ (HIT 3). డైరెక్టర్ శైలేష్ కొలను దర్శకత్వంలో రానున్న ఈ క్రైమ్ థ్రిల్లర్ (2025 మే 1న) థియేటర్లలో విడుదల కానుంది. ఈ మూవీని వాల్ పోస్టర్ సినిమా పతాకంపై హీరో నానినే నిర్మించారు.
అయితే, రేపు (గురువారం) సినిమా విడుదల దగ్గర పడుతుండటంతో ఏపీలో అడ్వాన్స్ ఓపెన్ కాలేదు. దాంతో ఆడియన్స్ తెగ కంగారుపడుతున్నారు. మూవీ టికెట్ల రేట్లు పెంచిన తర్వాతనే అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేసినట్లు చేస్తోంది.
ఈ క్రమంలో హిట్ 3 మూవీ టికెట్ల ధరలను పెంచుకునేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఈ మేరకు ఏపీ ప్రభుత్వం బుధవారం (ఏప్రిల్ 30న) ఉత్తర్వులు జారీ చేసింది. సింగిల్ స్క్రీన్స్‌లో రూ.50 (జీఎస్టీతో), మల్టీప్లెక్స్‌ల్లో రూ.75 (జీఎస్టీతో) పెంచుకునేలా వీలు కల్పించింది. ఈ ధరలు సినిమా రిలీజైన వారం రోజుల పాటు కొనసాగుతాయని జీవోలో పేర్కొంది. ఆ తర్వాత రోజు నుండి మామూలు ధరలకే టికెట్లు అందుబాటులో ఉంటాయని ప్రభుత్వం జీవోలో స్పష్టం చేసింది.
#HIT3 hike permission granted for 7 days in AP
— Filmy Connects (@FilmyConnects) April 30, 2025
₹50 for single screens
₹75 for multiplexes pic.twitter.com/vjyltIzity
అయితే, తెలంగాణలో టికెట్టు ధరల పెంపుకు అవకాశం లేకపోవడంతో హిట్ 3 చిత్ర బృందం ఇక్కడి ప్రభుత్వాన్ని కోరలేదని తెలుస్తోంది. సంధ్య థియేటర్ ఘటన తర్వాత తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సినిమా టికెట్ల ధరను పెంచుకునే వెసులుబాటు ఉండదంటూ తెలంగాణ ప్రభుత్వం తేల్చి చెప్పేసింది. దీంతో హిట్3 టికెట్టు ధరలు కేవలం ఏపీలోనే పెరిగాయి. తెలంగాణాలో ఎప్పుడు ఉండే ధరలే కొనసాగుతాయి.
►ALSO READ | RETRO Business: సూర్య ‘రెట్రో’ రికార్డు ప్రీ రిలీజ్ బిజినెస్.. బడ్జెట్ ఎంత, టార్గెట్ ఎన్ని కోట్లంటే?
ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ మినహా.. వరల్డ్ వైడ్గా హాట్ కేకుల్లా టికెట్ల బుకింగ్స్ జరుగుతున్నాయి. ఇందుకు ముఖ్య కారణం హిట్ ఫ్రాంచైజీలో వస్తోన్న మరో క్రైమ్ థ్రిల్లర్ కావడం. అలాగే, మినిమమ్ గ్యారెంటీ సక్సెస్ హీరో నాని ఉండటం. వీటికి తోడు రిలీజ్ చేసిన టీజర్, ట్రైలర్, సాంగ్స్ భారీ అంచనాలు పెంచడం. దాంతో సినిమా బిజినెస్ లెక్కలు చుక్కలు చూపించేలా జరిగాయి. నాని కెరియర్లలోనే హయ్యెస్ట్ బిజినెస్ జరుపుకుంది.