HIT 3 OTT Rights: ఇదెక్కడి మాస్ రా మావ.. రిలీజ్ కి ముందే రూ.50 కోట్లు కలెక్ట్ చేసిన నాని సినిమా..

HIT 3 OTT Rights: ఇదెక్కడి మాస్ రా మావ..  రిలీజ్ కి ముందే రూ.50 కోట్లు కలెక్ట్ చేసిన నాని సినిమా..

నేచురల్ స్టార్ నాని ఈ మధ్య వరుస హిట్లతో దూసుకుపోతున్నాడు. కాగా ఆమధ్య వచ్చిన దసరా, సరిపోదా శనివారం సినిమాలతో బ్లాక్ బస్టర్ హిట్లు అందుకున్నాడు. మధ్యలో "అంటే సుందరానికి" సినిమా నిరాశ పరిచినా మళ్ళీ హిట్ ట్రాక్ ఎక్కాడు. ప్రస్తుతం హీరో నాని తెలుగులో "హిట్ 3: ది థర్డ్ కేస్" అనే సినిమాలో హీరోగా నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో నాని పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటిస్తున్నాడు. ప్రముఖ డైరెక్టర్ శైలేష్ కొలను డైరెక్ట్ చేస్తుండగా "కేజీయఫ్" మూవీ ఫేమ్ శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా నటిస్తోంది. 

Also Read:-బలగం బలాన్ని ఎల్లమ్మలో కొనసాగించనున్న దర్శకుడు వేణు

అయితే ఈ సినిమా ఇటీవలే చివరి షెడ్యూల్ పూర్తి చేసుకుని రిలీజ్ కి రెడీ గా ఉంది. తాజా సమాచారం ప్రకారం  "హిట్ 3: ది థర్డ్ కేస్" సినిమా నాన్ థియేట్రికల్ బిజినెస్ గట్టిగానే చేసినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో ఓటీటీ రైట్స్ దాదాపుగా రూ.54 కోట్లకి అమ్ముడయినట్లు సమాచారం.  అయితే ఇప్పటికే ఆడియో రైట్స్ రూపంలో మేకర్స్ కి మరో రూ.6 కోట్లు బిజినెస్ జరిగింది. దీంతో దాదాపుగా నిర్మాణ వ్యయం  రిలీజ్ కి ముందే కలెక్ట్ చేసింది.  అయితే ఇంకా హిందీ, తమిళ్, మలయాళ వెర్షన్ రైట్స్ ఉన్నాయి. ఇవి కూడా అమ్ముడయితే "హిట్ 3" రిలీజ్ కి ముందే నిర్మాతలకి లాభాల పంట పండినట్లే..

ఈ విషయం ఇలా ఉండగా ఈ సినిమాలో హీరో నాని నటించడంతోపాటూ సహా నిర్మాతగా కూడా వ్యవహరిస్తున్నాడు. దీంతో తన సొంత బ్యానర్ అయిన వాల్ పోస్టర్ సినిమా, యూనానిమస్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై ప్రముఖ సినీ నిర్మాత ప్రశాంతి తిపిర్నేనితో కలసి నిర్మిస్తున్నాడు. ఇప్పటివరకూ హీరో నాని కెరీర్ లోనే "సరిపోదా శనివారం" హయ్యెస్ట్ ఓటీటీ  రైట్స్ (రూ.45 కోట్లు) పలికింది. "హిట్ 3" మే 1న పాన్ ఇండియా భాషల్లో ఆడియన్స్ ముందుకు రాబోతోంది. ఇటీవలే ట్రైలర్ రిలీజ్ కాగా మంచి రెస్పాన్స్ వచ్చింది.