
నేచురల్ స్టార్ నాని నటిస్తున్నలేటెస్ట్ మూవీ ‘హిట్ : ది థర్డ్ కేస్’ (HIT 3). డైరెక్టర్ శైలేష్ కొలను దర్శకత్వంలో రానున్న ఈ క్రైమ్ థ్రిల్లర్ (2025 మే 1న) థియేటర్లలో విడుదల కానుంది. ఈ మూవీని వాల్ పోస్టర్ సినిమా పతాకంపై హీరో నానినే నిర్మించారు.
ఇదిలా ఉంటే..సినిమా విడుదలకు దగ్గర పడుతుండటంతో ఆడియన్స్ తెగ ఉత్సాహంగా ఉన్నారు. ఇప్పటికే వరల్డ్ వైడ్గా హాట్ కేకుల్లా టికెట్ల బుకింగ్స్ జరుగుతున్నాయి. ఇందుకు ముఖ్య కారణం హిట్ ఫ్రాంచైజీలో వస్తోన్న మరో క్రైమ్ థ్రిల్లర్ కావడం. అలాగే, మినిమమ్ గ్యారెంటీ సక్సెస్ హీరో నాని ఉండటం. వీటికి తోడు రిలీజ్ చేసిన టీజర్, ట్రైలర్, సాంగ్స్ భారీ అంచనాలు పెంచడం. దాంతో సినిమా బిజినెస్ లెక్కలు చుక్కలు చూపించేలా జరిగాయి. నాని కెరియర్లలోనే హయ్యెస్ట్ బిజినెస్ జరుపుకుంది.
హిట్ 3 బిజినెస్ లెక్కలు:
ఈ క్రమంలోనే హిట్ 3 ప్రీ రిలీజ్ బిజినెస్ లెక్కలు బయటికి వచ్చాయి. కేవలం ప్రీ రిలీజ్ బిజినెస్ తోనే హిట్ 3.. 'హిట్' అయిందనేలా లెక్కలు కనబడుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఈ మూవీ రూ.49 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగినట్లు సినీ వర్గాల సమాచారం. అంటే, హిట్ 3 మూవీ రూ.50కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో బాక్సాఫీస్ దగ్గర బరిలో నిలువనుందన్నమాట.
బిజినెస్ చూసుకుంటే.. ఆంధ్రా ఏరియాలో రూ.15 కోట్లు, నైజాంలో రూ.13 కోట్లు, ఓవర్‌సీస్‌లో 10 కోట్లు, సీడెడ్‌తో పాటు ఇతర రాష్ట్రాల్లో కలిపి మరో 11 కోట్ల వరకు హిట్ 3 థియేట్రికల్ బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాల సమాచారం. అలాగే, ఈ సినిమా ఓటీటీ డిజిటల్ రైట్స్ కూడా భారీ ధరకు అమ్ముడయ్యాయట.
Book your tickets now.
— Unanimous Productions (@UnanimousProds) April 29, 2025
- https://t.co/T7DiAui6Pa#HIT3 In cinemas from May 1st. pic.twitter.com/7btMqJcIVg
హిట్ 3 ఓటీటీ రైట్స్:
ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ నెట్‍ఫ్లిక్స్ హిట్ 3 స్ట్రీమింగ్ హక్కులకు ఫ్యాన్సీ రేటుకి కొనుగోలు చేసిందట. ఇందుకు రూ.54 కోట్లతో డీల్ చేసుకున్నట్టు టాక్ వినిపిస్తోంది. ఇప్పటివరకూ హీరో నాని కెరీర్ లోనే "సరిపోదా శనివారం" హయ్యెస్ట్ ఓటీటీ రైట్స్ (రూ.45 కోట్లు) పలికింది.
►ALSO READ | NTRNeel: అఫీషియల్: ఎన్టీఆర్-నీల్ మూవీ బిగ్ అప్డేట్.. రిలీజ్ డేట్ ఫిక్స్.. గ్లింప్స్ కూడా
ఇక ఆడియో హక్కుల రూపంలో మరో రూ.6కోట్ల మేరకు పలికిందట. ఇలా మొత్తం మీద హిట్ 3 థియేట్రికల్, నాన్ థియేట్రికల్ కలిపి రూ.100కోట్లకు పైగా బిజినెస్ జరిగినట్టు తెలుస్తోంది. నాని కెరియర్లో అత్యధిక బిజినెస్ జరుపుకున్న మూవీగా హిట్ 3 నిలవనుంది.