HIT3Trailer: నాని భీకర వైలెన్స్‌.. RRR రికార్డులను బద్దలు కొట్టిన హిట్ 3 ట్రైలర్..

HIT3Trailer: నాని భీకర వైలెన్స్‌.. RRR రికార్డులను బద్దలు కొట్టిన హిట్ 3 ట్రైలర్..

నేచురల్ స్టార్ నాని హిట్ 3 (HIT 3) ట్రైలర్ ఫుల్ వైలెన్స్‌తో దూసుకెళ్తోంది. ఇంటెన్సిటీ, వైలెన్స్, స్టైలిష్ యాక్షన్‍తో హిట్ 3 ట్రైలర్ ప్రేక్షకులను మెప్పించించింది. దాంతో ఈ ట్రైలర్ రిలీజైన 24 గంటల్లోనే 23.1 మిలియన్లకి పైగా వ్యూస్తో యూట్యూబ్లో ట్రెండింగ్‌లో ఉంది.

లేటెస్ట్గా ఇందుకు సంబంధించిన అప్డేట్ను ప్రకటిస్తూ మేకర్స్ పోస్ట్ పెట్టారు. ఈ క్రమంలో హిట్ 3 ట్రైలర్ గత బ్లాక్ బస్టర్ సినిమాల రికార్డులను బద్దలు కొడుతుంది. రాజమౌళి RRR మూవీ ట్రైలర్ (20.45 మిలియన్లు) పేరిట ఉన్న రికార్డును బీట్ చేసింది. అయితే, ఇప్పటివరకు 24 గంటల్లో హయ్యెస్ట్ వ్యూస్ తెచ్చుకున్న మూవీగా పుష్ప 2 ట్రైలర్ (44.67 మిలియన్లు) ముందంజలో ఉంది.

క్రైమ్ యాక్షన్ థ్రిల్లర్గా రానున్న హిట్ 3 మూవీ మే 1న థియేటర్లలో విడుదల కానుంది. టీజర్, ట్రైలర్ రిలీజ్ చేసి అంచనాలు పెంచేశారు మేకర్స్. అర్జున్ సర్కార్ అనే సీరియస్ పోలీస్ ఆఫీసర్‌గా నాని నటించారు. గతంలో ఎప్పుడు లేనంత వైలెంట్ క్యారెక్టర్ చేశారు. దర్శకుడు శైలేష్ కొలను టేకింగ్ అదిరిపోయింది. యాక్షన్ సినిమాలని ఎంజాయ్ చేసే ప్రేక్షకులకు ఇది ఫుల్ మీల్స్ గా ఉండనుంది. 

ఈ సినిమాకు శైలేష్ కొలను దర్శకత్వం వహించాడు. నానికి చెందిన వాల్ పోస్టర్ సినిమా బ్యానర్ పై ప్రశాంతి తిపిర్నేని నిర్మించారు. శ్రీనిధి శెట్టి హీరోయిన్‍గా నటించారు.కోమలీ ప్రసాద్, సూర్యశ్రీనివాస్, రావు రమేశ్ కీలకపాత్రలు పోషించారు. అయితే, ఇందులో తమిళ స్టార్ హీరో కార్తీ క్యామియో రోల్‍లో కనిపించనున్నారనే రూమర్లు వైరల్ అవుతున్నాయి. త్వరలో క్లారిటీ రానుంది.