హైదరాబాద్ లో మరో హిట్ అండ్ రన్ కేసు.. యువకుడు మృతి..

హైదరాబాద్ లో మరో హిట్ అండ్ రేసు కేసు నమోదయ్యింది. రంగారెడ్డి జిల్లా కాటేదాన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది. మోటర్ సైకిల్ ను మరో మోటార్ సైకిల్ ఢీకొన్న ఘటనలో మన్నె నరేందర్ అనే యువకుడు మృతి చెందాడు. మద్యం మత్తులో మితిమీరిన వేగంతో వచ్చిన దుండగుడు నరేందర్ బైకును ఢీకొట్టి పరారయ్యాడు.

స్థానికుల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. సీసీటీవీ ఫుటేజ్ పరిశీలించిన పోలీసులు దుండగుడి కోసం గాలిస్తున్నారు. కాలనీలో ప్రతిరోజూ మితిమీరిన వేగంతో వెళ్లే మోటార్ సైకిళ్ల బెడద ఎక్కువయిందని, ఆకతాయిలపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరుతున్నారు స్థానికులు.