డ్రంక్ అండ్ డ్రైవ్ కు హైదరాబాద్ లో మరో చిన్నారి బలైంది. గోల్కోండ పరిధిలోని ఇబ్రహీంబాగ్ లో మద్యం మత్తులో రాంగ్ రూట్ లో అతి వేగంగా వచ్చిన ఓ కారు బైక్ ను ఢీ కొట్టింది. ఈ ఘటనలో బైక్ పై వెళ్తున్న చిన్నారి అక్కడికక్కడే మృతి చెందగా..తల్లిదండ్రులకు తీవ్ర గాయాలయ్యాయి.
స్థానికులు కారును అడ్డుకున్నారు. మద్యం సేవించి కారు నడిపినట్లు స్థానికులు చెబుతున్నారు. కారులో మద్యం బాటిళ్లు ఉన్నట్లు గుర్తించారు. డ్రైవర్ ను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు పోలీసులు. పరారీలో ఉన్న మరో ముగ్గురి కోసం గాలిస్తున్నట్లు చెప్పారు.
హైదరాబాద్ లో ఈ మధ్య ర్యాష్ డ్రైవింగ్ కేసులు పెరుగుతున్నాయి. తప్పతాగి అతివేగంతో రోడ్లపై వెళ్తున్న వారిని ఢీ కొడుతున్నారు. దీంతో అభంశుభం తెలియని అమాయకులు ప్రాణాలు బలవుతున్నాయి. మద్యం తాగి వాహనాలు నడిపే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు స్థానికులు