
హైదరాబాద్ బాల్ నగర్ లో మరో హిట్ అండ్ రన్ కేసు నమోదయ్యింది. బాల్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధి ఐడిపిఎల్ చౌరస్తాలో యువతిని ఢీ కొట్టిన ఫార్చునర్ కారు అతి వేగంతో ఆపకుండా వెళ్లిపోయింది. ఈ ఘటనలో యువతికి తీవ్రగాయాలయ్యాయి.
వెంటనే అలర్ట్ అయిన ట్రాఫిక్ పోలీసులు.. ఫతే నగర్ సిగ్నల్ దగ్గర కారు ఆపి నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. ఆక్సిడెంట్ చేసిన వ్యక్తి బల్కంపేటకు చెందిన గొగం అనిల్(35)గా గుర్తించారు పోలీసులు.
Also Read:-ఇది ఆడదా.. పిశాచా.. ? : పెళ్లయిన 2 వారాల్లోనే..
యువతికి తీవ్ర గాయాలు కావడంతో చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు పోలీసులు. మార్చి 24న రాత్రి మొయినాబాద్ లోని ఓ ఫాంహౌస్ లో విందుకు హాజరై ఉదయం తిరిగి వస్తుండగా ఐడిపీఎల్ చౌరస్తా దగ్గర యువతిని ఢీ కొట్టాడు. నిందితుడు అనిల్ మద్యం మత్తులో ఉన్నట్లుగా గుర్తించారు పోలీసులు. కేసు నమోదు చేసుకొని దర్యాఫ్తు చేస్తున్నారు బాల నగర్ పోలీసులు.