రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ లో హిట్ అండ్ రన్ కేసు నమోదైంది. ఆరంఘర్ చౌరస్తా సమీపంలో ఓ యువకుడిని గుర్తు తెలియని వాహనం ఢీ కొట్టింది. యువకుడు స్పాట్ లో మృతి చెందాగా.. వాహనాన్ని ఆపకుండా డ్రైవర్ వెళ్లిపోయాడు. ఘటనను గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. విషయం తెలుసుకున్న రాజేంద్ర నగర్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు.
మృత దేహాన్ని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. స్థానికంగా ఉన్న సీసీ టీవీ ఫుటేజ్ ను పరిశీలిస్తూ యువకుడిని ఢీ కొట్టిన వాహనాన్ని గుర్తించే పనిలో పడ్డారు పోలీసులు.