సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలో ఆదివారం (డిసెంబర్ 8) తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం జరిగింది. గుర్తుతెలియని వాహనం ఢీకొని ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు. స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. మృతి చెందిన వారిని పోలీస్ కానిస్టేబుళ్లు వెంకటేష్, పరంధాములు గుర్తించారు. మృతులది సిద్దిపేట జిల్లా పెద్దాకోడూరు, గాడిచర్లపల్లి గ్రామమని తెలిపారు. దౌల్తాబాద్, రాయపోల్ పోలీస్ స్టేషన్లలో కానిస్టేబుల్‌గా విధులు నిర్వర్తిస్తున్నారని చెప్పారు.
కానిస్టేబుళ్లు వెంకటేష్, పరంధాములు మారథాన్ పోటీల్లో పాల్గొనేందుకు హైదరాబాద్ వెళ్తుండగా గజ్వేల్‌లో ఈ ప్రమాదం జరిగినట్లు తెలిపారు. మృతుల కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు పేర్కొన్నారు. సీసీ ఫుటేజీ సహయంతో కానిస్టేబుళ్ల బైక్‌ను ఢీకొట్టిన వాహనాన్ని గుర్తించే పనిలో ఉన్నామన్నారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.