మీర్ పేటలో హిట్ అండ్ రన్ .. యువకుడి మృతి

మీర్ పేటలో  హిట్ అండ్ రన్ .. యువకుడి మృతి

హైదరాబాద్  మీర్ పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో రోడ్డు ప్రమాదం జరిగింది.  రోడ్డు దాటుతున్న ఓ వ్యక్తిని  వేగంగా వచ్చిన వాహనం ఢీ కొట్టింది.  జనవరి 1న జరిగిన ఈ ఘటన సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యింది.  

అసలేం జరిగిందంటే.? జనవరి 1న రాత్రి 9 గంటలకు   మిథిలా నగర్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం దగ్గర  రోడ్డు దాటుతుండగా  అనిల్ అనే యువకుడిని అతివేగంగా వచ్చిన వాహనం ఢీ కొట్టింది.  ఈ ఘటనలో  యువకుడి తలకు తీవ్ర గాయం తగలడంతో ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు స్థానికులు,  కుటుంబ సభ్యులు.  చికిత్స పొందుతున్న అనిల్  జనవరి 4న  ఉదయం మృతి చెందాడు. అయితే మీర్ పేట పీఎస్ లో ఫిర్యాదు చేసి మూడు రోజులైనా  పట్టించుకోవడం లేదని  మృతుడి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.