హిట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రన్‌‌‌‌‌‌‌‌ చట్టాన్ని రద్దు చేయాలి

గోదావరిఖని, వెలుగు: కేంద్రప్రభుత్వం ఇటీవల తీసుకొచ్చిన హిట్ అండ్ రన్ చట్టాన్ని రద్దు చేయాలని ఆల్ డ్రైవర్స్ అసోసియేషన్ డిమాండ్​చేసింది. అసోసియేషన్​ ఆధ్వర్యంలో సోమవారం గోదావరిఖని నుంచి పెద్దపల్లిలోని కలెక్టరేట్​వరకు భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు.

ఆల్ డ్రైవర్స్ యూనియన్ అధ్యక్షుడు కీసరి సదయ్య మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం హిట్ అండ్ రన్ చట్టం పేరుతో డ్రైవర్లకు రూ. 7 లక్షల జరిమానా, 10 ఏండ్ల జైలు శిక్ష విధించడం అమానుషమన్నారు. డ్రైవర్లపై అకారణంగా చేయిచేసుకున్న వారిని శిక్షించేలా చట్టం చేయాలని డిమాండ్​చేశారు. అనంతరం కలెక్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు వినతిపత్రం ఇచ్చారు. కార్యక్రమంలో యూనియన్ లీడర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నల్లాల శ్రీనివాస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, సభ్యులు పాల్గొన్నారు.