
జగిత్యాల జిల్లా కథలాపూర్ మండల కేంద్ర శివారులో ఎస్సారెస్పీ వరద కాలువ వద్ద దారి తప్పి రోడ్డు మీదకి వచ్చిన జింకను కారు ఢీ కొట్టింది. ఈ ఘటనలో జింక అక్కడిక్కడే మృతి చెందింది. అనుప మధు అనే వ్యక్తి ప్రమాదవశాత్తు జింకను కారుతో ఢీ కొట్టాడు. ఈ విషయం అటవీశాఖ అధికారులకు తెలియడంతో సంఘటన స్థలానికి చేరుకుని ఘటనను పరిశీలించి మధుపై కేసు నమోదు చేశారు. జింకను పోస్టుమార్టం చేశారు కథలాపూర్ పశువైద్య అధికారి.