గేట్ వే ఆఫ్ ఇండియా దగ్గర జోడే మారో నిరసన

గేట్ వే ఆఫ్ ఇండియా దగ్గర జోడే మారో నిరసన

మహారాష్ట్రలోని ఛత్రపతి శివాజీ మహరాజ్ విగ్రహం కూలిపోయిన ఘటన పెద్ద రాజకీయ దుమారం రేపుతుంది. మహారాష్ట్ర ప్రతిపక్ష పార్టీల ఆధ్వర్యంలో ఏక్ నాథ్ షిండే ప్రభుత్వానికి వ్యతిరేకంగా సెప్టెంబర్1 (ఆదివారం)న జోడే మారో అనే నిరసన కార్యక్రమానికి పిలుపునిచ్చారు. శివసేన (యుబిటి) చీఫ్ ఉద్ధవ్ ఠాక్రే, రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు నానా పటోలే, ఎన్‌సిపి (ఎస్‌పి) అధినేత శరద్ పవార్ సహా ప్రతిపక్ష అగ్రనేతలు ఈ నిరసనలో పాల్గొంటున్నారు. శివాజీ విగ్రహం కూలిపోయినందుకు ప్రధాని క్షమాపణలు తెలిపారు.

సింధుదుర్గ్‌లోని మాల్వాన్‌లో ఛత్రపతి శివాజీ 35 అడుగుల విగ్రహం నేవీ డే సందర్భంగా ప్రధాని మోదీ చేతుల మీదుగా ఏర్పాటు చేశారు. 8 నెలల్లోనే ఆ విగ్రహం కుప్పకూలడంతో విపక్షాలు ప్రభుత్వంపై విరుచుపడుతున్నాయి. ఫోర్ట్ ప్రాంతంలోని హుతాత్మా చౌక్ నుంచి గేట్‌వే ఆఫ్ ఇండియా వరకు నిరసన ప్రదర్శన జోడే మారో( చెప్పుతో కొట్టు) ర్యాలీకి పిలుపునిచ్చారు. గేట్‌వే ఆఫ్ ఇండియా వద్ద భారీ సంఖ్యలో భద్రతా బలగాలను ఏర్పాటు చేశారు. లా అండ్ ఆర్డర్ కారణంగా గేట్ వే ఆఫ్ ఇండియా దగ్గరకి టూరిస్టులను అనుమతించడం లేదు.

 కూల్చివేయడంపై ముంబైలో జరిగిన మెగా "జోడే మారో" నిరసనలో జరిగే నిరసన ప్రదర్శనకు ఏకనాథ్ షిండే ప్రభుత్వం భారీ భద్రతను మోహరించింది. లా అండ్ ఆర్డర్ కారణంగా స్మారక చిహ్నం పర్యాటకుల కోసం మూసివేయబడింది.  అవినీతిపరులైన శివద్రోహిలను క్షమించేది లేదని ఎన్సీపీకి చెందిన శరద్ పవార్ వర్గం మండిపడుతున్నారు. నాసిరకం పనులు చేసిన, అవినీతికి పాల్పడిన, శివాజీని అవమానించిన శివద్రోహిలకు గుణపాఠం చెప్పడమే లక్ష్యంగా ఈ పాదయాత్ర నిర్వహిస్తున్నట్లు కాంగ్రెస్ రాష్ట్ర శాఖ పేర్కొంది.

Also Read :- మళ్ళీ పెరిగిన గ్యాస్ సిలిండర్ ధరలు

ప్రతిపక్షాలు ఈ అంశాన్ని రాజకీయం చేస్తున్నాయని ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ అన్నారు. 50 ఏళ్లుగా కాంగ్రెస్, ఎన్సీపీ నేతలు శివాజీ మహారాజ్‌ను అవమానిస్తున్నారని, ఇందిరా గాంధీ ఎర్రకోటపై నుంచి శివాజీ మహారాజ్ గురించి ఒక్క మాట కూడా మాట్లాడలేదని, దానికి కాంగ్రెస్ క్షమాపణ చెబుతుందా? అని ప్రశ్నించారు. కానీ ప్రధాని మోదీ క్షమాపణలు చెప్పారని ఫడ్నవీస్ చెప్పారు. ఎలక్షన్లు వస్తున్నాయని మహా వికాస్ అఘాదీ నేతలు ఈ అంశాన్ని రాజకీయం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు.