వరల్డ్ బాక్సింగ్ కప్ ఫైనల్లో హితేష్

వరల్డ్ బాక్సింగ్ కప్ ఫైనల్లో హితేష్

న్యూఢిల్లీ:  ఇండియా బాక్సర్ హితేష్ బ్రెజిల్‌‌‌‌‌‌‌‌లోని ఫోస్ డో ఇగ్వాసు వేదికగా జరుగుతున్న వరల్డ్ బాక్సింగ్ కప్ లో ఫైనల్ చేరాడు. ఈ ఘనత  సాధించిన తొలి ఇండియన్‌‌‌‌‌‌‌‌గా నిలిచాడు. మెన్స్‌‌‌‌‌‌‌‌ 70కేజీ సెమీ ఫైనల్లో హితేష్ 5–0 తేడాతో   ఫ్రాన్స్ బాక్సర్ మకాన్ ట్రావోరేపై ఘన విజయం సాధించి గోల్డ్ మెడల్‌‌‌‌‌‌‌‌కు పంచ్ దూరంలో నిలిచాడు. 

ఇతర సెమీఫైనల్స్‌‌‌‌‌‌‌‌లో ఇండియా బాక్సర్లు నిరాశ పరిచారు.  జాదుమణి సింగ్ (50 కేజీ), విశాల్ (90 కేజీ), సచిన్ (60కేజీ) సెమీస్‌లో ఓడి ఇంటిదారి పట్టారు.