
న్యూఢిల్లీ: ఇండియా బాక్సర్ హితేశ్.. వరల్డ్ బాక్సింగ్ కప్‌లో గోల్డ్ మెడల్‌తో మెరిశాడు. శనివారం అర్ధరాత్రి జరిగిన మెన్స్ 70 కేజీల ఫైనల్లో హితేశ్ ప్రత్యర్థి ఒడెల్ కమరా (ఇంగ్లండ్) గాయంతో బౌట్‌కు దూరమయ్యాడు. దీంతో ఇండియన్ బాక్సర్‌కు వాకోర్ విజయం లభించింది. మెన్స్ 65 కేజీల ఫైనల్లో అభినాష్ జమ్వాల్.. యురీ రీస్ (బ్రెజిల్) చేతిలో ఓడి సిల్వర్ మెడల్‌తో సరిపెట్టుకున్నాడు.
బౌట్ ఆద్యంతం బలమైన పంచ్‌లతో విరుచుకుపడిన అభినాష్ అత్యుత్తమ పెర్ఫామెన్స్ ఇచ్చాడు. కానీ తుది ఫలితం మాత్రం ప్రత్యర్థికి అనుకూలంగా వచ్చింది. ఇక జాదుమణి సింగ్ (50 కేజీ), మనీష్ రాథోర్ (55 కేజీ), సచిన్ (60 కేజీ), విశాల్ (90 కేజీ) సెమీస్‌లో ఓడి కాంస్య పతకాలు సాధించారు. వరల్డ్ బాక్సింగ్ నిర్వహించిన ఎలైట్ లెవల్ ఇంటర్నేషన్ పోటీల్లో ఇండియా పాల్గొనడం ఇదే తొలిసారి. అయినప్పటికీ ఒక గోల్డ్ సహా ఆరు మెడల్స్‌తో బాక్సర్లు సత్తా చాటారు.