మెట్రోతోనే ట్రాఫిక్ కష్టాలు తగ్గుతయ్ : మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి

మెట్రోతోనే ట్రాఫిక్ కష్టాలు తగ్గుతయ్ :  మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి
  • ఢిల్లీ, బెంగళూరులాంటి పరిస్థితులు రానివొద్దు: మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి
  • సెకండ్ ఫేజ్ పూర్తయితే గ్లోబల్ సిటీగా హైదరాబాద్
  • అమీర్​పేట్ స్టేషన్​లో హెచ్​ఎంఆర్ఎల్ 7వ వార్షికోత్సవ వేడుకలు

హైదరాబాద్ సిటీ, వెలుగు: హైదరాబాద్​లో లక్షల వాహనాలతో ట్రాఫిక్ విపరీతంగా పెరిగిపోయిందని హెచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎంఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఎండీ ఎన్వీఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రెడ్డి అన్నారు. ట్రాఫిక్, పొల్యూషన్ పరంగా ఢిల్లీ, బెంగళూరులాంటి పరిస్థితులు ఇక్కడ రావొద్దంటే మెట్రో ఒక్కటే పరిష్కారమని తెలిపారు. మెట్రో సెకండ్ ఫేజ్ కంప్లీట్ అయితే.. హైదరాబాద్ గ్లోబల్ సిటీగా మారుతుందన్నారు. హైదరాబాద్​లో మెట్రో సేవలు ప్రారంభించి ఏడేండ్లు పూర్తయిన సందర్భంగా అమీర్​పేట్ మెట్రో స్టేషన్​లో వేడుకలు నిర్వహించారు. చీఫ్ గెస్ట్​గా హాజరైన ఎన్వీఎస్ రెడ్డి.. మెట్రో డిజిటల్ లోగోను ఆవిష్కరించి మాట్లాడారు. ‘‘సాధారణంగా ప్రభుత్వాలు మారితే.. పాలసీలు మారుతాయి. కానీ.. తెలంగాణలో ఆ పరిస్థితి లేదు. సీఎం రేవంత్ రెడ్డి మెట్రోకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. ఓల్డ్ సిటీ మెట్రోకు ఇప్పటికే భూ సేకరణ ప్రారంభమైంది. పనులు త్వరలోనే ప్రారంభిస్తాం. సెంట్రల్ గవర్నమెంట్ నుంచి పర్మిషన్ వచ్చాక పెట్టుబడులు పెట్టేందుకు జైకా, ఏడీబీ, ఎన్​డీబీ వంటి బ్యాంకులు సిద్ధంగా ఉన్నాయి’’అని ఎన్వీఎస్ రెడ్డి అన్నారు. 

మరిన్ని కొత్త కోచ్​లు తెప్పిస్తున్నం

హైదరాబాద్​లో పబ్లిక్ ట్రాన్స్​పోర్ట్ సిస్టమ్​కు మెట్రో వెన్నుముకగా నిలిచిందని ఎన్వీఎస్ రెడ్డి అన్నారు. ఎల్ అండ్ టీ చేపట్టిన ప్రతి ప్రాజెక్ట్ సక్సెస్ అయ్యిందని తెలిపారు. ప్రస్తుతం మెట్రో నష్టాల్లో ఉన్నదని, రాబోయే మూడు నుంచి నాలుగేండ్లలో లాభాల్లోకి వెళ్తామన్నారు. రాయదుర్గం, హైటెక్ సిటీ, అమీర్​పేట్ మెట్రో స్టేషన్లలో పొద్దున టైమ్​లో రద్దీ ఎక్కువగా ఉంటున్నదని తెలిపారు. కొత్త కోచ్​లు తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు. 

ఏడేండ్లలో మెట్రో విజయాలు

  •     మెట్రోలో 63.50 కోట్ల మంది ప్రయాణించారు.
  •     మెట్రో రైళ్లు రోజూ 25,600 కి.మీ నడుస్తున్నాయి.
  •     ఏడేండ్లలో మొత్తం 44.2 మిలియన్ కి.మీ ప్రయాణించాయి.
  •     మెట్రో రైళ్లు 99.8% టైమ్ పాంక్చువాలిటీ పాటిస్తున్నాయి.
  •     మెట్రో రాకతో 184 మిలియన్
  • లీటర్ల ఫ్యూయల్ సేవ్ అయింది.
  •     మెట్రోలో ప్రయాణించడం ద్వారా 424 మిలియన్ కిలోల కార్బన్​డై ఆక్సైడ్ రిలీజ్ కాకుండా ఆపింది.
  •     రోడ్డు ప్రయాణంతో పోలిస్తే...మెట్రో 50% జర్నీ టైమ్ తగ్గించింది.