ఫ్యూచర్​ సిటీ అథారిటీలోకి వచ్చే ప్రాంతాలివే..

ఫ్యూచర్​ సిటీ అథారిటీలోకి వచ్చే ప్రాంతాలివే..
  • ఓఆర్ఆర్​ అవతల, శ్రీశైలం హైవే, సాగర్​ స్టేట్​ హైవేల పరిధిలో ఏరియాలు
  • శంషాబాద్​, పరిసర ప్రాంతాలు కూడా 
  • ఇప్పటికే కలిసిన హెచ్ఎండీఏలోని 56 గ్రామాలు 

హైదరాబాద్​సిటీ, వెలుగు: బల్దియా, హెచ్​ఎండీఏ తరహాలో ఫ్యూచర్​సిటీ అభివృద్ధి కోసం ఫ్యూచర్ ​సిటీ డెవలప్​మెంట్​ అథారిటీ ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. సీఎం రేవంత్​రెడ్డి ప్రత్యేక దృష్టి పెట్టి నగరంలోని మూడు సిటీలతో పాటు నాలుగో సిటీగా ఫ్యూచర్​సిటీని డెవలప్​చేయాలని నిర్ణయించి అథారిటీ ఏర్పాటు చేశారు. అయితే, ఈ అథారిటీ పరిధిలోకి వచ్చే ప్రాంతాలను ప్లాన్​ప్రకారం డెవలప్​చేయనున్నారు. దీంతో ఏఏ ప్రాంతాలు ఇందులో కలుస్తాయన్న అంశంపై అంతా ఆసక్తి నెలకొన్నది. 

12 జోన్లుగా..

ఎఫ్​సీడీఏ పరిధిలోకి ఇప్పటికే హెచ్​ఎండీఏలోని 56 రెవెన్యూ గ్రామాలను కలపగా, ఔటర్​ రింగ్​రోడ్​ అవతల, శ్రీశైలం జాతీయ రహదారి, నాగార్జున సాగర్​ స్టేట్​ హైవేల పరిధిలోని పలు ప్రాంతాలను కూడా తీసుకువచ్చారు. అలాగే రాజీవ్​గాంధీ ఇంటర్నేషనల్​ ఎయిర్​పోర్ట్​ పరిధిలోని శంషాబాద్​, దాని పరిసర ప్రాంతాలు కూడా వచ్చి చేరాయి. ఈ ప్రాంతంలోనే తెలంగాణ ఇండస్ట్రియల్​ ఇన్​ఫ్రాస్ర్టక్చర్​(టీజీఐఐసీ) ఆధ్వర్యంలో ఎకనామిక్​ జోన్​, ఇండస్ట్రియల్​ క్లస్టర్లను అభివృద్ధి చేయనున్నారు. 

అథారిటీ పరిధిలో కాంప్రహెన్సివల్​ మాస్టర్​ప్లాన్​తో పాటు మల్టీమోడల్​ కనెక్టివిటీ, మోడరన్​ అర్బన్​ ఎమినిటీస్​ కల్పించనున్నారు. భవిష్యత్​లో ఈ ప్రాంతంలో రేడియల్​రోడ్లు, మెట్రోరైల్​ కనెక్టివిటీని కూడా కల్పించనున్నారు. అథారిటీ పరిధిలో యంగ్​ ఇండియా స్కిల్​ యూనివర్శిటీ అండ్​ ఎడ్యుకేషన్​ హబ్​లతో కలిపి 12 జోన్లుగా విస్తరించే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.