
- హెచ్ఎండీఏ బుద్ధపూర్ణిమ మాస్టర్‌ప్లాన్ సన్నాహాలు
- మెగా మాస్టర్‌ప్లాన్‌తో సంబంధం లేకుండా స్పెషల్ ప్లాన్
- ట్యాంక్‌బండ్ పరిసరాలన్నీ ఇందులోకే..
- ఎమ్యూజ్మెంట్ పార్కులు, భారీగా ఫుడ్ కోర్టులు
- టూరిస్టులను ఆకట్టుకునేలా కొత్త ఆకర్షణల ఏర్పాటు
హైదరాబాద్‌సిటీ, వెలుగు: నగరానికి మణిహారంగా ఉన్న ట్యాంక్బండ్పరిసర ప్రాంతాలు టూరిస్టులను మరింతగా ఆకట్టుకునేలా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. బుద్ధపూర్ణిమ ప్రాజెక్ట్పేరుతో గత ప్రభుత్వాలు ఎన్టీఆర్గార్డెన్, లుంబినీపార్క్, నెక్లెస్‌రోడ్, పీపుల్స్‌ప్లాజా ఏర్పాటు చేయగా, తాజాగా ట్యాంక్బండ్పరిసరాలను ప్లాన్ప్రకారం అభివృద్ధి చేసేందుకు హెచ్ఎండీఏ కసరత్తు చేస్తోంది. టీడీపీ, బీఆర్ఎస్హయాంలో బుద్ధపూర్ణిమ ప్రాజెక్టును విస్తరించేందుకు బుద్ధపూర్ణిమ మాస్టర్ప్లాన్రూపొందించాలని నిర్ణయించినా అప్పటికే నగరంలో ఐదు మాస్టర్ప్లాన్లు కొనసాగుతుండడంతో కార్యరూపం దాల్చలేదు. కాంగ్రెస్వచ్చిన తర్వాత బుద్ధ పూర్ణిమ మాస్టర్ ప్లాన్‌పై అధికారులు దృష్టి సారించారు. సీఎం దృష్టికి తీసుకువెళ్లగా, ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తోంది.
బుద్ధపూర్ణిమ మాస్టర్‌ప్లాన్
ప్రస్తుతం గ్రేటర్‌పరిధిలో బల్దియా, హుడా, హడా,సైబరాబాద్, ఎక్సటెండెడ్ ఏరియా మాస్టర్ప్లాన్లు ఉన్నాయి. వీటన్నంటిని ఏకం చేసి యూనిఫైడ్, మెగా మాస్టర్ ప్లాన్ 2050ని త్వరలోనే హెచ్ఎండీఏ అధికారులు ప్రకటించనున్నారు. ఈ మాస్టర్‌ప్లాన్‌తో సంబంధం లేకుండా బుద్ధ పూర్ణిమ మాస్టర్ ప్లాన్ రూపొందించాలని హెచ్ఎండీఏ నిర్ణయించింది. ఈ మాస్టర్‌ప్లాన్‌లో భాగంగా ఎమ్యూజ్మెంట్పార్కులు, వినోద కేంద్రాలు, భారీ సంఖ్యలో ఫుడ్‌కోర్టులతో పాటు పార్కుల అభివృద్ధి చేసి స్కైవేలు నిర్మించనున్నారు. నెక్లెస్‌రోడ్, పీపుల్స్‌ప్లాజా వంటి చోట్ల టూరిస్టులను ఆకట్టుకునేలా మరికొన్ని నిర్మాణాలు, అంబేద్కర్‌విగ్రహం, అమర వీరుల స్ర్మృతి చిహ్నం దగ్గర సందర్శకులను ఆకట్టుకునేందుకు ప్రత్యేకంగా తీర్చిదిద్దనున్నారు.
ట్యాంక్బండ్నుంచి నెక్లెస్ రోడ్‌ను కలుపుతూ స్కైవే, రోప్వేలతోపాటు బోటు షికార్లు వంటి అనేక వినోద కేంద్రాలను నిర్మించాలని ప్రతిపాదనలు ఉన్నట్టు అధికారులు తెలిపారు. టూరిజం డెవలప్‌మెంట్‌కోసం ప్రభుత్వం ప్రత్యేక దృష్టి కేంద్రీకరిస్తున్న నేపధ్యంలో తాజాగా బుద్ధపూర్ణిమ మాస్టర్‌ప్లాన్‌పై కూడా అధికారులు నిర్ణయం తీసుకోనున్నట్టు సమాచారం.