- ట్రాఫిక్ సమస్య నివారణకు నానక్ రామ్‌గూడ వైపు ర్యాంపు నిర్మాణం
- రూఫ్కొంత భాగం తొలగించాం
హైదరాబాద్‌సిటీ/గండిపేట్, వెలుగు: బీఆర్ఎస్ హయాంలో నార్సింగి వద్ద నిర్మించిన సైకిల్‌ట్రాక్‌ను ప్రభుత్వం కూల్చివేస్తోందంటూ సోషల్‌మీడియాలో జరుగుతున్న ప్రచారంలో నిజం లేదని హెచ్ఎండీఏ అధికారులు తెలిపారు. ఈ సైకిల్ ట్రాక్‌తో నానక్‌రామ్‌గూడ నుంచి ఐటీ కారిడార్ వైపు వెళ్లే వాహనదారులకు, ముఖ్యంగా ఫైనాన్సియల్ డిస్ట్రిక్, శేరిలింగంపల్లి, గచ్చిబౌలి, రాయదుర్గం, మాదాపూర్ నుంచి నానక్‌రామ్‌గూడ అక్కడి నుంచి నార్సింగి, పుప్పాల్‌గూడ వెళ్లే దారిలో ట్రాఫిక్ఇబ్బందులు తలెత్తుతున్నాయన్నారు.
దీంతో నానక్‌రామ్‌గూడ వైపు ట్రాఫిక్సాఫీగా వెళ్లేందుకు ర్యాంపు నిర్మించాలని బల్దియా అధికారులను కోరామన్నారు. అందుకోసం నానక్‌రామ్ గూడ వైపు ఉన్న సైకిల్ట్రాక్కు సంబంధించి రూఫ్కొంత భాగం తొలగించినట్టు తెలిపారు. ఈ ర్యాంప్ నిర్మాణం పూర్తయిన తర్వాత ఆ రూఫ్‌ను తిరిగి ఏర్పాటు చేస్తామన్నారు. కాగా, ప్రయాణికుల సౌకర్యార్థం పుప్పాలగూడ వద్ద ఔటర్ రింగ్ రోడ్డు దిగేందుకు వీలుగా రాంప్ పనులను మంగళవారం ప్రారంభించినట్లు చెప్పారు.