- స్పష్టం చేసిన హెచ్ఎండీఏ అధికారులు
హైదరాబాద్సిటీ, వెలుగు: హెచ్ఎండీఏ పరిధిలోని గ్రామ పంచాయతీల్లో లేఅవుట్ల రిజిస్ట్రేషన్లను నిషేధించినట్టు జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని హెచ్ఎండీఏ అధికారులు స్పష్టం చేశారు. అనధికార లేఅవుట్లలో ప్లాట్ల వివరాలను తమ వెబ్సైట్లలో పెట్టలేదని తెలిపింది.
ఏడాదిగా హెచ్ఎండీఏ నుంచి రిజిస్ట్రేషన్ అండ్స్టాంపుల శాఖకు ఎలాంటి అభ్యర్థనలు పంపలేదని పేర్కొంది. పంచాయతీల్లో లేఅవుట్ల రిజిస్ట్రేషన్లు ఆపాలంటూ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఎలాంటి ఉత్తర్వులు జారీ చేయలేదని అధికారులు ట్విట్టర్వేదికగా స్పష్టం చేశారు. పుకార్లను నమ్మొద్దని సూచించారు.