
రంగారెడ్డి జిల్లా బుద్వేల్ భూములు రికార్డు ధర పలికాయి. బుద్వేల్ లో హెచ్ఎండీఏ ప్రభుత్వ భూములను ఇ వేలం వేసింది. మొత్తం 14 ప్లాట్లు 100.01 ఎకరాలను విక్రయించింది. ఇ వేలంలో భూముల అమ్మకం ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి రూ.3 వేల 625 కోట్ల 73 లక్షల ఆదాయం వచ్చింది. తొలి సెషన్ లో 58.11 ఎకరాలకు రూ.2 వేల57 కోట్ల 67 లక్షల ఆదాయం వచ్చింది.
ఇక రెండో సెషన్ లో 41.90 ఎకరాలకు రూ. ఒక వెయ్యి568 కోట్ల 6 లక్షల ఆదాయం వచ్చింది. అత్యధికంగా ఎకరం ధర రూ.41.75 కోట్లు పలికింది. అత్యల్పంగా ఎకరం ధర రూ.33. 25 కోట్లు పలికింది. యావరేజ్ గా ఒక ఎకరం రూ.36.25 కోట్ల ధరకు అమ్ముడుపోయింది. అయితే.. భూములు కొనుగోలు చేసిన బిడ్డర్ల జాబితాను హెచ్ఎండీఏ ప్రకటించింది.
భూముల ధరల వివరాలు ఇవే..
* రెండో సెషన్ లో 41.90 ఎకరాలకు ర.1,568.06 కోట్ల ఆదాయం
* అత్యధికంగా ఎకరం ధర రూ.41.75 కోట్లు
* అత్యల్పంగా ఎకరం ధర రూ.33. 25 కోట్లు
* యావరేజ్ గా ఎకరాకు రూ.36.25 కోట్ల ధర
* భూ కొనుగోలు చేసిన బిడ్డర్ల జాబితా ప్రకటించని హెచ్ఎండీఏ