- పర్మిషన్ల విషయంలో హెచ్ఎండీఏ కొత్త రూల్
- లాండ్ ఏరియా, సర్వే నంబర్, ఫ్లోర్లు, ఇతర డిటెయిల్స్రాయాలని ఆదేశం
- ఇక కొనేవారికి సమాచారం.. అధికారుల తనిఖీలకు ఈజీ
హైదరాబాద్‌సిటీ, వెలుగు: అపార్ట్మెంట్లు, హైరైజ్బిల్డింగులు కట్టేవారు ఇక నుంచి సదరు నిర్మాణాల వివరాలను తెలియజేసేలా నోటీసు బోర్డులు పెట్టాలని హెచ్ఎండీఏ కొత్త రూల్పెట్టింది. అనుమతుల కోసం దరఖాస్తు చేసుకున్న వారికి పర్మిషన్ఇచ్చే సమయంలో ఈ కొత్త నిబంధన విధిస్తోంది. హైడ్రా ఎంట్రీతో అనుమతుల జారీ విషయంలో హెచ్ఎండీఏ ఆచితూచి వ్యవహరిస్తోంది.
గతంలో ఎన్ఓసీని రెవెన్యూ, ఇరిగేషన్శాఖల నుంచి తీసుకురావాలని చెప్పగా, తర్వాత ఇరిగేషన్, రెవెన్యూ, హెచ్ఎండీఏ ఆఫీసర్లు కలిసి ఫీల్డ్విజిట్చేసిన తర్వాతే అనుమతులు ఇస్తామని ప్రకటించింది. తాజాగా వాటితోపాటు కొత్తగా ప్రతి నిర్మాణదారుడు తాము నిర్మించే బిల్డింగుల ఎదుట నోటీసు బోర్డు ఏర్పాటు చేయాలని ఆదేశించింది.
ఏమేమి ఉండాలంటే...
హెచ్ఎండీఏ అనుమతులు ఇచ్చిన తర్వాత నిర్మాణదారుల నుంచి నోటీసు బోర్డు ఏర్పాటు చేస్తామనే హామీ పత్రం తీసుకుంటుంది. దీని ప్రకారం ప్రతి నిర్మాణదారుడు నిర్మాణ స్థలంలో ఏర్పాటు చేసే బోర్డులో స్థలం వివరాలు, సర్వే నంబర్, ఎన్నిఫ్లోర్లు కడుతున్నారు? అనుమతులకు సంబంధించిన నంబర్, స్థలం ఎఫ్టీఎల్ కానీ బఫర్‌జోన్‌లో కానీ లేదని తెలియజేయాలి. దీని వల్ల అందులో అక్కడ విల్లా లేదా ఫ్లాట్కొనాలనుకునేవారు, కమర్షియల్అయితే స్పేస్ కొనేవారికి పూర్తి సమాచారం దొరుకుతుంది. కొన్న తర్వాత అనుమతులు లేవనో, చెరువు ప్రాంతంలో ఉందనో హైడ్రా వచ్చి కూల్చివేసే పరిస్థితులు ఉంటాయి. హెచ్ఎండీఏ కొత్త రూల్‌తో ఇక నుంచి ఆ భయం ఉండదు.