- సర్కారు ఇచ్చే ఛాన్స్ లేకపోవడంతో సొంత ప్రయత్నాలు
- ప్రతినిధుల కోసం టెండర్ల ఆహ్వానం
- ఆస్తులను గ్యారంటీగా పెట్టాలని నిర్ణయం
హైదరాబాద్‌సిటీ, వెలుగు: వేల కోట్ల రూపాయల భారీ ప్రాజెక్టుల నిర్మాణానికి హెచ్ఎండీఏ దగ్గర డబ్బులు లేకపోవడంతో ఆస్తులను పూచీకత్తుగా పెట్టి అప్పులు చేసేందుకు రెడీ అయ్యింది. గత ప్రభుత్వం చేసిన అప్పులు ప్రస్తుత సర్కారుకు గుదిబండలా మారడంతో హెచ్ఎండీఏకు గ్యారంటీగా ఉండే అవకాశం లేదు. దీంతో సొంతంగా నిధులు సమీకరించుకునేందుకు ప్లాన్‌వేసింది. దీనికి ప్రభుత్వం గ్రీన్సిగ్నల్ఇవ్వడంతో హెచ్ఎండీఏ తరఫున లావాదేవీలు నిర్వహించడానికి ఆర్థిక సంస్థలు లేదా బ్యాంకింగ్‌రంగంలో అనుభవమున్న మర్కంటైల్బ్యాంకర్లను ప్రతినిధిగా నియమించుకోవాలని నిర్ణయించుకుంది.
దీని కోసం ఇటీవల టెండర్లు ఆహ్వానించింది. ఆర్థిక రంగంలో అనుభవంతోపాటు, సొంతంగా నిధులను సమకూర్చుకునే కెపాసిటీ ఉన్న సంస్థలు దరఖాస్తు చేసుకోవాలని కోరింది. హెచ్ఎండీఏ తరఫున బాండ్లను విడుదల చేసి నిధులు సమకూర్చాలని, ఆయా బాండ్లను కొనేవారికి హెచ్ఎండీఏ ఆస్తులను గ్యారంటీగా ఉంచాలని కూడా అధికారులు నిర్ణయించారు. ఆయా సంస్థలు టెండర్లను దాఖలు చేసేందుకు ఈనెల 25వ తేదీ వరకు సమయం ఇవ్వగా, అవసరాన్ని బట్టి పొడిగించే అవకాశం ఉందంటున్నారు. ప్రతినిధిగా ఎంపికైన సంస్థ సేకరించే నిధుల నుంచి కొంత కమీషన్ ఇవ్వనున్నట్టు తెలిసింది.
రూ.20 వేల కోట్లను సేకరణే లక్ష్యం
గ్రేటర్‌పరిధిలో హెచ్ఎండీఏ పలు కీలక ప్రాజెక్టులను చేపట్టబోతోంది. ఇందులో ఎలివేటెడ్కారిడార్, ట్రిపుల్ఆర్ను కలుపుతూ ఓఆర్ఆర్నుంచి తొమ్మిది చోట్ల నుంచి గ్రీన్ఫీల్డ్రోడ్స్, మీరాలం ట్యాంక్‌వద్ద ఫ్లై ఓవర్, తదితర ప్రాజెక్టులున్నాయి. ప్రస్తుతం సుమారు రూ.3 వేల కోట్ల అప్పుల్లో ఉన్నహెచ్ఎండీఏ వద్ద ఫండ్స్లేకపోవడంతో రూ. 20వేల కోట్లను సేకరించాలని చూస్తోంది. 4 నెలల్లో రూ. 5 వేల కోట్లు, మరో ఏడాదిలో రూ. 15 వేల కోట్లు సమకూర్చుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నది. సేకరించిన అప్పులను ఎంత కాలంలో రీపేమెంట్చేయాలన్నది కూడా సదరు సంస్థ నిర్ణయం తీసుకోవచ్చని తెలిపారు.
ఏ ప్రాజెక్టుకు ఎంత అవసరమంటే..
సిక్స్లేన్ఎలివేటెడ్డబుల్డెక్కర్కారిడార్నిర్మాణంలో భాగంగా హెచ్ఎండీఏ రెండు ఫ్లై ఓవర్లు నిర్మించనున్నది. సికింద్రాబాద్ప్యారడైజ్నుంచి బోయిన్పల్లి డెయిరీఫారం రోడ్‌వరకు (5.32 కిమీ) డబుల్డెక్కర్ఫ్లైఓవర్, జేబీఎస్నుంచి శామీర్‌పేట ఓఆర్ఆర్వరకు (18.12 కి.మీ.) వరకూ మరో ఫ్లై ఓవర్నిర్మించనున్నది. సికింద్రాబాద్టు బోయిన్పల్లి కారిడార్రూ. 1580 కోట్లు, జేబీఎస్టు శామీర్‌పేట కారిడార్‌కు రూ. 3620 కోట్లు అవసరం కానుంది. ఔటర్రింగ్రోడ్నుంచి ట్రిపుల్ఆర్ను కలిపి తొమ్మిది చోట్ల గ్రీన్‌ఫీల్డ్ రోడ్లను నిర్మించనుంది. 215 కిమీ నిర్మించే ఈ రోడ్లకు రూ. 3వేల కోట్లు ఖర్చు కాగలదని అంచనా.
వీటి పనులు త్వరలోనే ప్రారంభం కానున్నాయి. బెంగళూరు హైవే (ఎన్‌హెచ్44) నుంచి చింత్మెట్రోడ్డును కలుపుతూ 2.55 కి.మీ. బ్రిడ్జి నిర్మాణం చేపట్టనున్నది. ఇవే కాకుండా టాంక్బండ్చుట్టూ స్కైవాక్ప్రతిపాదన కూడా వుంది. మీరాలం టాంక్ వద్ద మరో ఫ్లై ఓవర్, తీగల వంతెన నిర్మించే ప్రతిపాదనలున్నాయి. ఇవే కాకుండా మరికొన్ని పెండింగ్ పనులకు నిధుల అవసరముంది. మొత్తం రెండున్నరేండ్లలో ఆయా ప్రాజెక్టులను అందుబాటులోకి తీసుకురావాలంటే భారీ మొత్తంలో నిధులు అవసరవుతాయని భావిస్తున్న హెచ్ఎండీఏ బాండ్స్జారీ, నిధుల సేకరణ కోసం ప్రయత్నాలు చేస్తోంది.