మట్టి గణపతి.. గట్టి సంకల్పం.. ఉచితంగా పంపిణి

 మట్టి గణపతి.. గట్టి సంకల్పం.. ఉచితంగా పంపిణి

పర్యావరణ పరిరక్షణలో ప్రతి ఏటా మాదిరిగానే ఈ ఏడాది 5 లక్షల మట్టి విగ్రహాలను జీహెచ్‌ఎంసీ, హెచ్‌ఎండీఏ, పీసీబీ శాఖలు పంపిణీకి ఏర్పాట్లు చేస్తున్నాయి. మట్టి గణపతులనే పూజిద్దామంటూ ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చేందుకు తమ వంతు బాధ్యతగా ఉచితంగా 8 అంగుళాల పొడవుతో కూడిన మట్టి విగ్రహాలను అందించాలని నిర్ణయించారు. ప్రతి ఏడాది లాగే ఈ సారి  మట్టి గణపతి విగ్రహాలను ఉచితంగా పంపిణి చేయడానికి  అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు.  నగరంలో 33  సెంటర్ల ద్వారా మట్టి గణపతులను పంచిపెట్టనున్నారు.  ఈ నెల 4 వ తేదీ నుంచి 6 వ తేది వరకు పంచిపెడతామని హెచ్​ఎండీఏ అధికారులు తెలిపారు,  పర్యావరణ పరిరక్షణకోసం హెచ్ఎండీఏ అధికారులు 2017 నుండి ఉచితంగా మట్టి గణపతులను పంపిణి చేస్తున్నారు.  

ALSO READ | గణేష్​ చతుర్థి 2024: ఏ రాశివారు ఎలాంటి వినాయకుడుని పూజించాలి.. నైవేద్యాలు ఏంటో తెలుసా..