
దిల్ సుఖ్ నగర్, వెలుగు : సరూర్ నగర్ లోని రంగారెడ్డి జిల్లా పాత కోర్టు భవనాన్ని హెచ్ఎండీఏ అధికారులు బుధవారం కూల్చివేశారు. వారం కింద ఈ కాంప్లెక్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఇందులో 2008 వరకు రంగారెడ్డి జిల్లా కోర్టు కొనసాగింది. వాహనాల పార్కింగ్, ఇతర సమస్యలతో 2008లో కోర్టును ఎల్బీనగర్ కు మార్చారు. అప్పటి నుండి పాత కోర్టు కాంప్లెక్స్ ను కొందరు లీజుకు తీసుకుని షాపులు ఏర్పాటు చేశారు.
అద్దె చెల్లించకుండా కొనసాగారు. భవనం శిథిలావస్థకు చేరుకుందని, నివాస యోగ్యం కాదని 2008లోనే ఉస్మానియా ఇంజినీరింగ్ విభాగం నిపుణులు తేల్చారు. హైకోర్టు తీర్పుతో ఇటీవల హెచ్ఎండీఏ అధికారులు బిల్డింగ్‌ను స్వాధీనం చేసుకున్నారు. బుధవారం నేలమట్టం చేశారు.