- పార్టీ జోన్లతోపాటు భారీగా ఫుడ్ కోర్టులు
- అమ్యూజ్మెంట్ పార్కులు, కన్వెన్షన్ సెంటర్లు,రిక్రియేషన్ జోన్ల ఏర్పాటు
- ఆదాయం పెంచుకునేందుకు హెచ్ఎండీఏ ప్లాన్స్
- త్వరలో కన్సల్టెన్సీల నియామకం
- ‘బుద్ధ పూర్ణిమ’తో అనుకున్నంత ఆదాయం రావడం లేదనే...
హైదరాబాద్‌సిటీ, వెలుగు: గ్రేటర్‌వాసులకు వినోదాన్ని అందించే కేంద్రాలను పెంచేందుకు హెచ్ఎండీఏ ప్రణాళికలు రూపొందిస్తోంది. ట్యాంక్బండ్చుట్టూ పార్టీ జోన్లు, ఎంటర్టైన్మెంట్జోన్లు, అమ్యూజ్మెంట్పార్కుల ఏర్పాటుతో పాటు ఇప్పుడున్న ఫుడ్‌కోర్టులకు అదనంగా భారీ సంఖ్యలో ఫుడ్‌కోర్టులు నెలకొల్పడానికి సిద్ధమవుతోంది.
ప్రస్తుతం ఎన్టీఆర్, లుంబినీ, సంజీవయ్య పార్కు, లేక్ వ్యూ పార్క్, ఎకో పార్క్ తో పాటు నెక్లెస్‌రోడ్, పీపుల్స్‌ప్లాజా, హుస్సేన్‌సాగర్‌కు పెద్ద సంఖ్యలో సందర్శకులు తరలివస్తున్నారు. అయినా ఆశించిన స్థాయిలో ఆదాయం రావడం లేదని హెచ్ఎండీఏ భావిస్తోంది. భవిష్యత్‌లో మరిన్ని కొత్త ఆకర్షణలను ఏర్పాటుచేస్తే స్థానికులతో పాటు ఇతర ప్రాంతాల నుంచి వచ్చే టూరిస్టులు తరలివచ్చే అవకాశం ఉంటుందని అనుకుంటోంది.
అందులో భాగంగా బుద్దపూర్ణిమ ప్రాజెక్టు ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కార్యక్రమాలతో పాటు ప్రైవేట్కన్సల్టెన్సీలను నియమించుకుని వినూత్న ఆలోచనలతో పర్యాటకులను ఆకట్టుకోవాలని భావిస్తోంది. కన్సల్టెన్సీల సూచనలు, సలహాలతో టాంక్బండ్ పరిసరాలను టూరిజం స్పాట్‌గా డెవలప్చేయాలనుకుంటోంది.
రోజూ 15 వేల నుంచి 25 వేల మంది
టాంక్బండ్ పరిసరాల్లో ఉన్న పార్కులు, పర్యాటక ప్రాంతాలు బుద్దపూర్ణిమ ప్రాజెక్టు (బీపీపీ) సారథ్యంలో నిర్వహిస్తున్నారు. పీపుల్స్‌ప్లాజా, నెక్లెస్‌రోడ్, ఈట్‌స్ట్రీట్, ఎన్టీఆర్గార్డెన్స్, లుంబినీపార్క్, సంజీవయ్య పార్క్‌లకు రోజూ15 నుంచి 25వేల మంది వరకూ సందర్శకులు వస్తున్నారు. పండగలు, సెలవు దినాల్లో ఈ సంఖ్య లక్ష వరకూ చేరుతోంది. వీటి ద్వారా ప్రస్తుతం వస్తున్న ఆదాయం ఆశించిన స్థాయిలో ఉండడం లేదని అధికారులు భావిస్తున్నారు.
పార్కులు, ఈట్ స్ర్టీట్, ఎంటర్టైన్మెంట్జోన్ల ద్వారా ఏడాదికి రూ.100 కోట్ల కూడా రావడం లేదంటున్నారు. ఎన్టీర్గార్డెన్స్, లుంబినీ పార్కుల ప్రవేశ రుసుం, లోపలి స్టాల్స్నిర్వాహకుల నుంచి వస్తున్న ఆదాయం స్వల్పంగానే ఉంటోందంటున్నారు. విజిటర్స్సంఖ్య ఎక్కువగా ఉన్నా కొందరు ఆఫీసర్ల తీరు మూలంగా ఈ పరిస్థితి వచ్చిందని గుర్తించారు.
టికెట్ల జారీలో అక్రమాల వల్ల ఆదాయం పెరగడం లేదని, అనుభవజ్ఞులైన కన్సల్టెంట్స్ను నియమించుకుని ఈ సమస్యను సాల్వ్ చేసుకోవాలని ఆలోచిస్తున్నారు. ప్రస్తుతం టాంక్బండ్చుట్టూ 902 హెక్టార్ల ల్యాండ్అందుబాటులో ఉండగా, వారి సలహాలు, సూచనలతో పాటు కొత్త ఐడియాలతో రాబోయే రోజుల్లో పెద్దయెత్తున కార్యక్రమాలు నిర్వహించాలని ప్లాన్చేస్తున్నారు.
పార్కింగ్ లాట్స్ ఏర్పాటుకు లైసెన్సులు
హుస్సేన్సాగర్తీరంలో ప్రస్తుతమున్నవే కాకుండా కొత్తగా మరిన్ని రిక్రియేషన్, పార్టీ జోన్లను ఏర్పాటు చేయాలని హెచ్ఎండీఏ నిర్ణయించింది. వీటి నిర్మాణం, నిర్వహణ బాధ్యతలను కన్సల్టెంట్స్‌కు అప్పగించనున్నారు. వారి ఆధ్వర్యంలోనే పార్టీ ప్లేసెస్, అమ్యూజ్మెంట్ పార్క్, కన్వెన్షన్సెంటర్లు ఏర్పాటు చేయనున్నారు. లుంబినీపార్క్, సంజీవయ్యపార్కు, నెక్లెస్‌రోడ్, పీపుల్స్‌ప్లాజా వంటి ప్రాంతాల్లో మరిన్ని పార్టీ జోన్లు, ఫుడ్‌కోర్టులు ఏర్పాటు చేయనున్నారు.
భారీ అంబేద్కర్‌విగ్రహం, అమర వీరుల స్మృతి స్తూపం దగ్గర ఆదాయం పెంచుకునేందుకు ఏం చేయాలన్నదానిపై కన్సల్టెన్సీ అడ్వైజ్తీసుకుంటారు. ఆయా ప్రాంతాల్లో పార్కింగ్లాట్స్ఏర్పాటుకు లైసెన్సులు ఇచ్చి భారీ ఆదాయం సమకూర్చుకోవాలన్నది ఒక ఆలోచన. ఇవే కాకుండా ప్రస్తుతమున్న అద్దెలను కూడా పున: పరిశీలించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు.