- ఓఆర్ఆర్ వెంట సైకిల్ ట్రాక్‌పై మరిన్ని సదుపాయాలు
- టెండర్లను ఆహ్వానించిన హెచ్ఎండీఏ అధికారులు
- ట్రాక్ నిర్వహణ మరో కంపెనీకి అప్పగింతకు నిర్ణయం
- సైక్లింగ్ చేసేవారికి వసతుల కల్పనకు ఇంకో కంపెనీకి పనులు
హైదరాబాద్, వెలుగు : ఔటర్‌రింగ్‌రోడ్ వెంట ఏర్పాటైన 24 కి. మీ సైకిల్‌ట్రాక్‌పై ఔత్సాహికులను ఆకర్షించేందుకు మరిన్ని సదుపాయాలు కల్పించేందుకు హెచ్ఎండీఏ నిర్ణయించింది. హైదరాబాద్గ్రోత్కారిడార్ లిమిటెడ్(హెచ్ జీసీఎల్) ఆధ్వర్యంలో కొత్తగా మరో కంపెనీకి పనులను ఇచ్చేందుకు తాజాగా అధికారులు టెండర్లను ఆహ్వానించారు. గత ప్రభుత్వ హయాంలో సైకిల్ ట్రాక్ ను నిర్మించి అందుబాటులోకి తెచ్చారు. నానక్‌రామ్ గూడ నుంచి టీజీపీఏ జంక్షన్‌వరకు 8.50 కి.మీ, నార్సింగి నుంచి కొల్లూరు వరకు 14.50 కి.మీ రెండు కారిడార్లు నిర్మించారు. అప్పట్లో సరిగా సదుపాయాలు కల్పించకపోగా ప్రారంభించిన కొద్దిరోజులకే మూసి వేశారు.
4 నెలల కిందట ఓపెన్ చేసి..
కాంగ్రెస్ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సైకిల్‌ట్రాక్‌ను మెరుగైన సదుపాయాలతో మరోసారి అందుబాటులోకి తీసుకురావాలని ఐటీ ఉద్యోగులు, ఔత్సాహికులు కోరారు. దీంతో 4 నెలల కిందట తిరిగి ప్రారంభించారు. దీని నిర్వహణను స్మార్ట్ బైక్మొబిలిటీ ప్రైవేట్లిమిటెడ్సంస్థకు ఇచ్చా రు. సైకిళ్లను సొంతంగా లేదంటే రెంట్ తీసుకుని కూడా ట్రాక్‌పై నడపొచ్చని సూచించింది. ఇందుకు నార్సింగి హబ్‌లో మొదటి సైకిల్ స్టేషన్ ఏర్పాటు చేసి.. 200 సైకిళ్లను అందుబాటులోకి తెచ్చారు. ఇందులో 40కి పైగాఎలక్ట్రిక్ సైకిళ్లను ఉంచారు. ఒక్కోదానికి గంటకు రూ.50 చార్జ్ తీసుకుంటారు. తెలంగాణ పోలీస్ అకాడమీ జంక్షన్, నానక్‌రాంగూడ, నార్సింగి, కొల్లూరు ప్రాంతాల్లో 4 స్టేషన్లు నిర్మించి మౌలిక వసతులు కల్పించారు. ప్రస్తుతం నార్సింగి హబ్‌లో అద్దెకు సైకిళ్లు అందుబాటులో ఉన్నాయని అధికారులు తెలిపారు.
గంటల వారీగా చార్జ్ లు
తాజాగా మరికొన్ని స్టేషన్లలో సైకిళ్లను అందుబాటులో ఉంచగా.. వీటి నిర్వహణ పనులను మరో కంపెనీకి అప్పగించాలని నిర్ణయించారు. ఇప్పటికే ఫస్ట్ కంపెనీ 200 సైకిళ్లు ఉండగా.. ఒక్కో స్టేషన్ కు100 సైకిళ్లను హెచ్ జీసీఎల్అధికారులు అందుబాటులో ఉంచారు. మరో రెండు స్టేషన్లలో 200 సైకిళ్ల ఏర్పాటుకు ప్రస్తుతం హెచ్ఎండీఏ రెండో కంపెనీకి టెండర్లను పిలిచింది. ఇందుకు వసూలు చేసే చార్జ్ లను నిర్ణయించింది. పెడల్బైక్గంటకు రూ. 50 , టెండెమ్బైక్రూ. 100, ఎలక్ర్టిక్ బైక్రూ. 80 చొప్పున తీసుకుంటారు. ఇందుకు కాంట్రాక్ట్ సంస్థల నుంచి ఏడాదికి ఒక్కో బైక్ కు రూ. 4,500 లైసెన్స్ ఫీజు చెల్లించేలా అధికారులు నిర్ణయించారు. వీకెండ్,పబ్లిక్హాలిడేస్ల్లో ప్రతి అరగంటకు పెడల్బైక్ రూ. 50 , టెండెమ్రూ. 100, ఎలక్ట్రిక్‌బైక్ లకు రూ. 80 చొప్పున వసూలుకు అధికారులు పర్మిషన్ ఇచ్చారు. రోజూ సైకిల్ నడపాలనుకునే వారి నుంచి అన్ లిమిటెడ్ గా రూ. 99, వీక్లీ అన్లిమిటెడ్నడపాలనుకుంటే రూ. 349 , నెలవారీ అన్లిమిటెడ్ రూ. 699 తీసుకుంటారు.
రాత్రిపూట లైటింగ్
సైకిల్ ట్రాక్‌లోకి ఇతర వెహికల్స రాకుండా మీటింగ్ పాయింట్లు, ట్రాక్ కలరింగ్, సేఫ్టీ సిగ్నల్స్ , విద్యుత్ దీపాలు, విశ్రాంతి, భద్రతా ఏర్పాట్లు కల్పించేందుకు అధికారులు కూడా చర్యలు చేపట్టారు. దీంతో ఎలాంటి ప్రమాదాలకు ఆస్కారం ఉండు. ముఖ్యంగా రాత్రి వేళల్లో సైక్లింగ్ చేసేందుకు వీలుగా విద్యుత్ దీపాలతో వెలుతురును అందించేందుకు హెచ్‌ఎండీఏ అధికారులు ఏర్పాట్లు చేశారు. సిటీలో భారీగా పెరిగిపోయే వాహనాలతో పర్యావరణం కాలుష్యం పెరుగుతుండడంతో సైకిళ్ల వాడకం పెంచేలా.. వాటినితొక్కడం దర్వారా ఆరోగ్యపరంగా కూడా ప్రయోజనకారిగా ఉంటుందని అధికారులు సైకిల్‌ట్రాక్‌ను నిర్మించారు. రెండో సంస్థకు కూడా పనులు అప్పగించడం వల్ల ఓ ఆర్ఆర్ సైకిల్ ట్రాక్‌పై సైకిల్నడపాలనుకునే వారికి మరిన్ని సౌకర్యాలను కల్పించాలనేదే లక్ష్యమని అధికారులు తెలిపారు.