![గద్దర్ విగ్రహ ఏర్పాటుకు హెచ్ఎండీఏ, పోలీసుల అడ్డంకులు](https://static.v6velugu.com/uploads/2024/01/hmda-police-obstacles-to-erect-gaddar-statue-at-osmania-university_I9OuriLcCa.jpg)
- ప్రభుత్వం జోక్యం చేసుకుని చర్యలు తీసుకోవాలి
- ఓయూ విద్యార్థి సంఘాల నేతలు
ఓయూ, వెలుగు : ప్రజా యుద్ధనౌక గద్దర్ విగ్రహావిష్కరణకు అడ్డంకులు సృష్టిస్తున్న హెచ్ఎండీఏ, పోలీసులపై ప్రభుత్వం స్పందించి తగు చర్యలు తీసుకోవాలని ఓయూ విద్యార్థి సంఘాల నేతలు కోరారు. శుక్రవారం ఓయూ ఆర్ట్స్ కాలేజీ వద్ద వారు మీడియాతో మాట్లాడారు. సంగారెడ్డి జిల్లా పటాన్ చెరువు పరిధి తెల్లాపూర్ మున్సిపాలిటీకి చెందిన భూమిలో గద్దర్ విగ్రహం ఏర్పాటు చేయాలని మున్సిపాలిటీ ఏకగ్రీవ తీర్మానం చేసిందని పేర్కొన్నారు.
ఆ మేరకు విగ్రహం ఏర్పాటు చేసేందుకు పనులు కొన సాగుతుండగా, గద్దర్ అంటే గిట్టని కొందరు వ్యక్తులు, హెచ్ఎండీఏ అధికారులు, పోలీసులు పనులు జరగకుండా అడ్డుకుంటున్నారని ఆరోపించారు. వెంటనే ప్రభుత్వం జోక్యం చేసుకొని విగ్రహావిష్క రణ సజావుగా జరిగేలా చర్యలు తీసుకోవాలని కోరారు. విద్యార్థి సంఘాల నేతలు నెల్లి సత్య , నామ సైదులు, లెనిన్, దివాకర్, నాగేందర్, సునీల్, రాఘవేందర్
తదితరులు ఉన్నారు.