
- కొత్వాల్‌గూడ పార్కులో ఆరు ఎకరాల్లో ఏర్పాటుకు సన్నాహాలు
- పీపీపీ పద్ధతిలో నిర్మాణానికి నిర్ణయం
- టెండర్లను ఆహ్వానించిన హెచ్ఎండీఏ
హైదరాబాద్‌సిటీ, వెలుగు: రంగారెడ్డి జిల్లా శంషాబాద్మండలం కొత్వాల్‌గూడలో150 ఎకరాల్లో హెచ్ఎండీఏ నిర్మిస్తున్న ఎకోపార్కులో యూత్‌ను ఆకట్టుకోవడానికి ‘అడ్వెంచర్స్జోన్’ ఏర్పాటు చేస్తున్నారు. దీని కోసం పార్కులో 6 ఎకరాలను కేటాయించారు. ఈ ప్రాజెక్టుకు సుమారు రూ.150 కోట్ల నుంచి 200 కోట్ల వరకు ఖర్చు అవుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు.
ప్రైవేట్, పబ్లిక్పార్ట్నర్షిప్పద్ధతిలో నిర్మించాలని నిర్ణయించిన అధికారులు ఆసక్తి గల సంస్థలను ఆహ్వానిస్తూ గ్లోబల్టెండర్లు పిలిచారు. ఎంపికైన కంపెనీకి పనులు అప్పగించనున్నారు. ఇప్పటికే ఎకో పార్కు పనులు 90 శాతం పూర్తికాగా, త్వరలోనే ప్రారంభించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. పార్క్‌కు ఉదయం వెళ్తే సాయంత్రం వరకూ ఎంజాయ్చేసేలా పలు ప్రత్యేకతలతో పక్కాగా తీర్చిదిద్దుతున్నారు.
ఆకట్టుకునే రీతిలో ..
సాహసాలు చేసేందుకు ఇష్టపడే యువత, పిల్లలకు అడ్వెంచర్జోన్లోని వివిధ రకాల గేమ్స్ఆకట్టుకుంటాయని అధికారులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ప్రధానంగా పార్కులోని అందాలను పైనుంచి వీక్షించేందుకు స్కై బ్రిడ్జి నిర్మిస్తున్నారు. ఆరు మీటర్ల వెడల్పు, 30 మీటర్ల ఎత్తులో దీని నిర్మాణం జరగనుంది. యూత్ఎక్కువ ఆసక్తి చూపించే రోలర్ కోస్టర్జిప్లైన్ను ఏర్పాటు చేయనున్నారు. దీన్ని 300 మీటర్లకు తక్కువ కాకుండా నిర్మించే అవకాశం ఉంది. పర్వతాలు ఎక్కాలని ఆసక్తి చూపే వారి కోసం, పిల్లల కోసం క్లైంబింగ్వాల్ను కట్టనున్నారు.
60 అడుగుల ఎత్తులో జెయింట్స్వింగ్ఏర్పాటు చేయనున్నారు. 6 మీటర్ల వెడల్పు, 150 మీటర్ల ఎత్తులో సస్పెన్షన్ బ్రిడ్డి కూడా నిర్మించనున్నారు. 100 మీటర్ల ఎత్తులో ఎగిరే ఫ్లయింగ్కప్, 60 అడుగుల ఎత్తులో హ్యూమన్ స్లింగ్షాట్,250 మీటర్ల జిప్‌లైన్, 360 డిగ్రీ ఫ్లైయింగ్సైకిల్, రోప్ కోర్స్, ఎత్తుపై నుంచి దూకే సాహసం చేసే వారికి బంగీ జంప్ కోసం బంగీ ట్రాంపోలైన్, వర్టెక్స్ టన్నెల్స్, రైఫిల్ షూటింగ్వంటివి అడ్వెంచర్ జోన్లో ఏర్పాటు కానున్నాయి. వీటితోపాటు రక రకాల స్పోర్ట్స్యాక్టివిటీస్ను అందుబాటులోకి తీసుకురానున్నట్టు అధికారులు తెలిపారు.