Health Alert : చైనా, జపాన్ దేశాలను వణికిస్తున్న.. HMPV వైరస్ లక్షణాలు ఇవే..

Health Alert : చైనా, జపాన్ దేశాలను వణికిస్తున్న.. HMPV వైరస్ లక్షణాలు ఇవే..

చైనాలో మరో కొత్త వైరస్ HMPV( హ్యూమన్ మెటాప్ న్యూమో వైరస్). కలకలం రేపుతోంది. చైనాలో ఈ వ్యాధి విస్తృతంగా వ్యాప్తి చెందుతున్నట్లు ప్రపంచ మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి. అసలు హెచ్ఎంపీవీ అంటే ఏంటి..? ఆ వ్యాధి లక్షణాలు ఏంటి? వస్తే ఏమవుతుందనే దానిపై జనం తీవ్రంగా చర్చించుకుంటున్నారు. 

HMPV అంటే 

యూఎస్ సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (సీడీసీ) ప్రకారం హెచ్ఎంపీవీ 2001లో కనుగొనబడిని న్యూమోవిరిడే కుటుంబానికి చెందిన వైరస్. ఇది శ్వాసకోశ ఇన్ఫెక్షన్లకు కారణం అవుతోంది.

 ఈ వైరస్ తో దాదాపు కరోనా వైరస్ లక్షణాలే ఈ వైరస్ లో కనిపిస్తాయి.  ఈ వైరస్ చలికాలంలో ఎక్కువగా వ్యాప్తి చెందుతుందంటున్నారు డాక్టర్లు.  సాధారణ జలుబుతోనే ఈ వైరస్ లక్షణాలు బయటపడుతాయని చెబుతున్నారు. కొన్నిసార్లు ఈ వైరస్ తో  న్యుమోనియా, ఆస్తమా వంటి శ్వాసకోశ ఇన్ఫెక్షన్లు కూడా వచ్చే అవకాశం ఉంది. 

HMPV వైరస్  లక్షణాలు

  • దగ్గు , ముక్కు కారడం లేదా మూసుకుపోవడం .
  •  జ్వరం,  గొంతునొప్పి, తుమ్ములు రావడం
  • శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది
  •  కొన్ని సందర్భాల్లో  శరీరంపై  దద్దుర్లు

 
 వ్యాప్తి, నివారణ

  • హెచ్ఎంపీవీ  వైరస్ గాలి ద్వారా వ్యాప్తి చెందుతుంది.  వైరస్ సొకిన వ్యక్తి దగ్గినప్పుడు లేదా తుమ్మినప్పుడు  గాలి ద్వారా ఇతరులకు వ్యాప్తి చెందుతుంది.   
  •   వైరస్ సోకిన వ్యక్తులు ఇతరులను   తాకడం, షేక్ హ్యాండ్ ఇచ్చుకోవడం, సన్నిహితంగా ఉండడం చేయకూడదు. 
  • అపరిశుభ్రంగా ఉంటూ కళ్లను, ముక్కును,చెవులను తాకడం  చేయకూడదు. చేతులను ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకోవాలి.
  • మాస్కులు ధరించాలి

Also Read :- చైనా నుంచి జపాన్ కు వ్యాపించిన వైరస్

ఎవరికి ఎక్కువ ప్రమాదం అంటే?

  • ఈ వైరస్ తో   5 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలు,  ముఖ్యంగా చిన్నపిల్లలకు ప్రమాదం ఎక్కువగా ఉండవచ్చని చెబుతున్నారు. వృద్ధులు, ముఖ్యంగా 65 ఏళ్లు పైబడిన వాళ్లు జాగ్రత్తగా ఉండాలి. 
  • రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్నవాళ్లు.. ఆస్తమా లేదా COPD వంటి దీర్ఘకాలిక శ్వాసకోశ పరిస్థితులు ఉన్న వ్యక్తులు ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉంటుంది.,

వైరస్ నిర్ధారణ

  • హెచ్ఎంపీవీ వైరస్ నిర్ధారణకు  న్యూక్లియిక్ యాసిడ్ యాంప్లిఫికేషన్ టెస్ట్ (NAAT) ద్వారా వైరల్ జన్యువును  గుర్తించడం.
  • ఇమ్యునోఫ్లోరోసెన్స్ లేదా ఎంజైమ్ ఇమ్యునోఅస్సే ఉపయోగించి శ్వాసకోశ స్రావాలలో వైరల్ యాంటిజెన్‌లను గుర్తించడం.