ఇండియాలో HMPV టెన్షన్ మొదలైంది. చైనాలో అత్యంత వేగంగా వ్యాప్తి చెందటంతో ప్రజలు ఆస్పత్రుల పాలవుతున్న పరిస్థితుల దృష్ట్యా.. భారత ప్రభుత్వం ప్రత్యేక చర్యలు మొదలు పెట్టింది. అన్ని రాష్ట్రాలకు ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని హెచ్చరికలు పంపింది.
అయితే చైనాను వణికిస్తున్న HMPV కేసులు ఇండియాలో కూడా బయటపడటం ఆందోళన కలిగిస్తోంది. సోమవారం (6 జనవరి 2025) మూడు HMPV కేసులు బయట పడినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ నిర్ధారించింది.
బెంగళూరులో రెండు కేసులు నమోదయ్యాయి. 8 ఏండ్ల అమ్మాయికి హెచ్ఎంపివి సోకినట్లు తేలడంతో చికిత్స అందిస్తున్నారు. అదే విధంగా మూడు నెలల పాపకు పాజిటివ్ రావడంతో ట్రీట్ మెంట్ చేసి డిస్చార్జి చేశారు.
ఇక గుజరాత్ లో కూడా కేసులు నమోదు కావడంతో ఆ రాష్ట్రంలో ఆందోళనకర పరిస్థితులు నెలకొన్నాయి. రెండు నిలల చిన్నారికి HMPV సోకడం తో ప్రభుత్వం అప్రమత్తం అయ్యింది. అయితే కేసులు నిర్ధారణ అయిన తర్వాత ఈ చిన్నారుల కుటుంబాలకు బయట కాంటాక్ట్ లేకపోవడంతో వ్యాప్తి అంతగా ఉండదని భావిస్తు్న్నారు. విదేశాల నుంచి వస్తున్న వారిపై ప్రత్యేక నిఘా పెట్టాలని ప్రభుత్వం భావిస్తోంది.
ALSO READ | భయపడకండి.. కొత్తదేమి కాదు.. HMPV వైరస్‌పై కేంద్రం కీలక ప్రకటన
HMPV కేసులు పెరుగుతున్న క్రమంలో కర్ణాటక, మహారాష్ట్ర, ఢిల్లీ అధికారులు ముందు జాగ్రత్త చర్యలు మొదలు పెట్టారు. కోవిడ్-19 తదనంతర పరిస్థితులు దృష్టిలో ఉంచుకొని ముందస్తు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
ఆంధ్రప్రదేశ్ లో ప్రస్తుతం ఎలాంటి కేసులు నమోదు కాలేదని ఆరోగ్య శాఖ అధికారులు ప్రకటించారు. HMPV కేసుల విషయంలో ఎలాంటి ఆందోళన అవసరం లేదని సూచించారు. కోవిడ్-19 మాదిరగానే ఒక వ్యక్తి నుంచి మరో వ్యక్తికి వ్యాపిస్తుందని ఆరోగ్య అధికారిణి కె.పద్మావతి తెలిపారు. ఇది ముఖ్యంగా చిన్న పిల్లలు, వృద్ధులపై ఎక్కవ ప్రభావ చూపుతుందని, జాగ్రత్తలు పాటించాలని సూచించారు.
ALSO READ | అందరూ ఏడాదిలోపు వారే.. దేశంలో నాలుగుకు చేరిన HMPV కేసుల సంఖ్య
కర్ణాటక రాజధాని బెంగళూరులో కేసులు నమోదు కావడంతో అధికారులను అలర్ట్ చేశారు సీఎం సిద్ధరామయ్య. HMPV పై ఆందోళనలు నెలకొన్న పరిస్థితులలో ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. బెంగళూరు లో 2 కేసులు బయటపడటంతో అన్ని చర్యలు తీసుకోవాలని అలర్ట్ చేశారు.
గుజరాత్ అహ్మదాబాద్ లో ఒక కేసు నమోదు కావడంతో ప్రభుత్వం అలర్టయినట్లు ఆరోగ్య మంత్రి రుషికేష్ పటేల్ తెలిపారు. రెండేళ్ల చిన్నారికి పాజిటివ్ వచ్చిందని, భయపడాల్సిన పనిలేదని అన్నారు. ఈ పరిస్థితులను హ్యాండిల్ చేయడానికి ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు.
ఇక మహారాష్ట్రలో ముందస్తు చర్యలు చేపట్టినట్లు ఆరోగ్య శాఖ తెలిపింది. విదేశాల నుంచి వచ్చే వారి సంఖ్య ముంబై, పుణె నగరాలలో ఎక్కువగా ఉండటంతో వారికి ప్రత్యేక పరీక్షలు నిర్వహించి ట్రాక్ చేస్తున్నట్లుగా ఒక ప్రకటనలో తెలిపింది.