సేమ్ సీన్ రిపీట్ అవుతోందా.. ముఖానికి మాస్కులు.. సోషల్ డిస్టెన్స్ తప్పదా..

సేమ్ సీన్ రిపీట్ అవుతోందా.. ముఖానికి మాస్కులు.. సోషల్ డిస్టెన్స్ తప్పదా..

ఇండియాలోకి HMPV వైరస్ వచ్చేసింది.. బెంగళూరులో రెండు కేసులు గుర్తించినట్లు నిర్దారించింది కర్ణాటక ప్రభుత్వం. చైనా వణికిస్తున్న ఈ వైరస్ ఇండియాలోకి ఎంటరయిందన్న వార్త దేశవ్యాప్తంగా కలకలం రేపుతోంది. దీంతో జనాలు కరోనా రోజులను గుర్తు చేసుకుంటున్నారు. మళ్ళీ సోషల్ డిస్టెన్స్ పాటించాలా, ముఖానికి మాస్కులు ధరించాలా అన్న చర్చ మొదలైంది. ఈ క్రమంలో మరుగదర్శకాలు జార్ చేసింది కేంద్ర ప్రభుత్వం. HMPV గురించి ఆందోళన చెందకుండా, శ్వాసకోశ సంబంధ ఇన్ఫెక్షన్ల విషయంలో జాగ్రత్తలు పాటించాలని సూచించింది కేంద్రం.

వైరస్ లక్షణాలు బయటపడితే తక్షణమే స్పందించి చర్యలు తీసుకోవాలని వైద్యాధికారులకు సూచించింది పభుత్వం. హైదరాబాద్ లోని  ఫీవర్, గాంధీ, ఉస్మానియా, వంటి ప్రధాన హాస్పిటళ్లతో పటు రాష్ట్రవ్యాప్తంగా జిల్లాల హాస్పిటళ్లను అప్రమత్తం చేసింది తెలంగాణ ప్రభుత్వం. కరోనా సమయంలో లాగానే అనారోగ్యంతో ఉన్నవారు మాస్కులు ధరించాలని.. సోషల్ డిస్టెన్స్ పాటించాలని సూచించింది ప్రభుత్వం.

Also Read : అలాంటి చిన్నారులకు చైనా వైరస్ ఎలా ఎటాక్ అయ్యింది..!

HMPV విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు:

  • చేతులను తరచుగా సబ్బు, నీరు లేదా శానిటైజర్ తో కడగాలి.
  • దగ్గినప్పుడు, తుమ్మినప్పుడు నోరు, ముక్కును కర్చీఫ్ లేదా టిష్యూ పేపర్, మాస్కుతో కవర్ చేసుకోవాలి.
  • రద్దీగా ఉండే ప్రదేశాలకు దూరంగా ఉండాలి. 
  • ఫ్లూ లక్షణాలతో బాధపడుతున్నవారికి దూరంలో ఉండాలి.
  • జ్వరం, దగ్గు, తుమ్ములు ఉన్నప్పుడు బహిరంగ ప్రదేశాలకు దూరంగా ఉండాలి. 
  • నీరు ఎక్కువగా తాగాలి.. పౌష్టికాహారం తీసుకోవాలి,కంటినిండా నిద్రపోవాలి.
  • అనారోగ్యంతో ఉంటే ఇంట్లోనే ఉండి ఎవరినీ కలవకుండా ఉండాలి.