ఇదీ కరోనా లాంటిదే గానీ.. కోవిడ్-19 వైరస్కు, HMPV వైరస్కు తేడా ఇదే..

ఇదీ కరోనా లాంటిదే గానీ.. కోవిడ్-19 వైరస్కు, HMPV వైరస్కు తేడా ఇదే..

చైనా.. వైరస్ల పుట్టిల్లుగా మారిపోయింది. 2019లో కోవిడ్ ఆ దేశం నుంచే వ్యాపించింది.  మళ్లీ ఇప్పడు చైనాలో హ్యూమన్ మెటాప్న్యూమో వైరస్(HMPV) కొత్తది కాదని.. గతం నుంచి ఉందని US సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ తెలిపింది. HMPV వైరస్ను నిరోధించడానికి కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. ఇది కోవిడ్ 19ను పోలి ఉందని US సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (CDC) వెల్లడించింది.

ప్రస్తుతం చైనాలో పుట్టిన హ్యూమన్ మెటాప్‌న్యూమోవైరస్ (HMPV) ప్రపంచ దేశాలను భయ భ్రాంతులకు గురిచేస్తుంది. ఈ వైరస్ వ్యాక్సిన్ సాధారణ శ్వాసకోశ వైరస్.. ఊపిరితిత్తుల్లో ఇన్‌ఫెక్షన్‌లకు దారితీస్తుంది. రెస్పిరేటరీ సిన్సిటియల్ వైరస్ (RSV) ..  ఫ్లూ మాదిరిగా సాధారణంగా వింటర్ సీజన్లో వ్యాప్తి చెందుతుంది. HMPV  వైరస్  మొదటి కేసు 2001లో నమోదైందని US సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (CDC) తెలిపింది. HMPV.. RSVతో పాటు న్యుమోవిరిడే అనే వైరస్ నుంచి ఉద్భవించింది.

 కోవిడ్-19 అనేది SARS-CoV-2 వైరస్ వల్ల కలిగే ఒక అంటు వ్యాధి. HMPV వైరస్ ..  SARS-CoV-2 వైరస్  ఒకేలా ఉంటాయని CDC తెలిపింది .ఈ  రెండు వైరస్‌లు శ్వాసకోశ వ్యాధికి కారణమవుతాయి. చిన్నపిల్లలు, వృద్ధులు.. రోగనిరోధక శక్తి తక్కువుగా ఉన్న వారిలో వ్యాపించే అవకాశం ఉంది. రెండు వైరస్‌లు దగ్గు ... తుమ్ములు సోకిన వ్యక్తి నుంచే ఇతరులకు ఎక్కువగా వ్యాపిస్తాయి. అవి వైరస్‌లను కలిగి ఉన్న వస్తువులు లేదా ఉపరితలాలను తాకడం ద్వారా మరియు నోరు, ముక్కు లేదా కళ్లను తాకడం ద్వారా కూడా వ్యాప్తి చెందుతాయి. COVID-19 ఉష్ణోగ్రత -సెన్సిటివ్‌గా కనిపిస్తుంది,  అందువల్ల సీజన్ మాదిరిగా ఉంటుంది. కానీ.. HMPV  వైరస్ అన్ని  సీజన్లలో తిరుగుతుందని US CDC తెలిపింది. యునైటెడ్ స్టేట్స్‌లో శీతాకాలం చివరిలో అంటువ్యాధులు ఎక్కువగా ఉంటాయి.

Also Read : భారత్ లోకి వచ్చింది.. ఆస్పత్రులు అప్రమత్తంగా ఉండాలి

తీసుకోవలసిన జాగ్రత్తలు:
* కనీసం 20 సెకన్ల పాటు సబ్బు  నీటితో తరచుగా చేతులు కడుక్కోవాలి
* చేతులతో కళ్లు, ముక్కు లేదా నోటిని తాకవద్దు
* అనారోగ్యంతో ఉన్న వ్యక్తులకు దూరంగా ఉండండి
* జలుబు వంటి లక్షణాలు ఉన్న రోగులు దగ్గినప్పుడు ...  తుమ్మేటప్పుడు నోరు మరియు ముక్కును కప్పుకోవాలి.
* ఇతరులు వాడిన పాత్రలు ( కంచాలు.. గ్లాసులు) వాడవద్దు..