ఎస్టీపీపీ నుంచి పవర్ మేక్ ను తొలగించాలి : హెచ్​ఎంఎస్

ఎస్టీపీపీ నుంచి పవర్ మేక్ ను తొలగించాలి : హెచ్​ఎంఎస్
  • షట్ డౌన్ పనులు సక్రమంగా నిర్వహించకపోవడంతో కోట్ల నష్టం: హెచ్​ఎంఎస్

 జైపూర్, వెలుగు: జైపూర్​లోని సింగరేణి థర్మల్ పవర్ ప్లాంట్ లో కాంట్రాక్ట్ పనులు నిర్వహిస్తున్న పవర్ మేక్ కంపెనీని వెంటనే తొలగించాలని హెచ్ఎంఎస్ శ్రీరాంపూర్ ఏరియా వైస్ ప్రెసిడెంట్ తిప్పారపు సారయ్య డిమాండ్​చేశారు. గురువారం హెచ్ఎంఎస్ ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో సారయ్య మాట్లాడుతూ.. పవర్ ప్లాంట్ లో పవర్ మేక్ కంపెనీ ఆధ్వర్యంలో షట్ డౌన్ పనులు సక్రమంగా నిర్వహించకపోవడంతో రూ.కోట్లలో నష్టం జరిగిందన్నారు.

 పవర్ మేక్ కంపెనీ అవగాహన రాహిత్యం వల్ల బాటమ్ యాష్ కుప్పకూలే పరిస్థితి ఏర్పడిందని, షట్ డౌన్ జరిగి ఆరు నెలలు కాకముందే బాటం యాష్ లో వేసిన కోట్ల రూపాయల విలువ చేసే డోర్ ఇంక్లూజర్, ఫీడ్ గేట్, హపర్ పరికరాలు ధ్వంసమయ్యాయని మండిపడ్డారు. కంపెనీ నిర్వాకం వల్ల ఏ క్షణమైనా బాటం గేట్స్ కుప్పకూలి భారీ ప్రమాదం జరిగే అవకాశాలు ఉన్నాయన్నారు. సదరు కంపెనీ నిర్వాకం కారణంగా పని స్థలాల్లో ప్రమాదాలు జరిగాయన్నారు. ఇప్పటికైనా సింగరేణి సీఎండీ వెంటనే స్పందించాలని.. పవర్ ప్లాంట్ లో ఉత్పత్తి ఆటంకాలకు, ప్రమాదాలకు కారణమైన పవర్ మేక్ కంపెనీ కాంట్రాక్టును వెంటనే రద్దు చేసి, సంస్థకు జరిగిన నష్టాన్ని రికవరీ చేయాలని డిమాండ్  చేశారు. కార్యక్రమంలో బ్రాంచ్ కార్యదర్శి అనిల్ రెడ్డి, హెచ్ఎంఎస్ నాయకులు పాల్గొన్నారు.