కిరీటి సూసైడ్ నోట్​లో ఉన్న పేర్లను బయటపెట్టాలి

  •     హెచ్​ఎంఎస్​ జనరల్ సెక్రటరీ రియాజ్​ అహ్మద్

జైపూర్, వెలుగు : జైపూర్ మండల కేద్రంలోని సింగరేణి థర్మల్ పవర్ ప్లాంట్​లో పనిచేసే రిటైర్డ్ ఆఫీసర్లను ఉద్యోగాల నుంచి తొలగించాలని హెచ్ఎంఎస్ రాష్ట్ర అధ్యక్షుడు రియాజ్ అహ్మద్ డిమాండ్ చేశారు. సింగరేణి థర్మల్ పవర్ ప్లాంట్ ఎదురుగా సోమవారం సమావేశం నిర్వహించి మాట్లాడారు. సింగరేణి థర్మల్ పవర్ ప్లాంట్​లో పనిచేసే డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ ఇంజనీర్ కిరీటిది ఆత్మహత్య కాదని, విజిలెన్స్ అధికారులు ఎంక్వైరీ పేరిట చేసిన హత్య అని మండిపడ్డారు.

కిరీటి సూసైడ్ నోట్ లో ఉన్న పేర్లను బయటపెట్టాలని, విజిలెన్స్ అధికారులపై క్రిమినల్ కేసులు పెట్టాలని డిమాండ్ చేశారు. సింగరేణి సీఎండీ బాలరాం నాయక్ కిరీటి కుటుంబాన్ని పరామర్శించి, వారిని ఆదుకోవాలని కోరారు. ఈ సమావేశంలో హెచ్​ఎంఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్లు కృష్ణ ప్రసాద్, ప్రదీప్ రెడ్డి, నాయకులు అనిల్ రెడ్డి, విక్రమ్, కిరణ్ కుమార్, సాయికృష్ణారెడ్డి, రమేశ్ పాల్గొన్నారు.